తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా 100 రోజుల పాటు

Spread the love

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా 100 రోజుల పాటు చేపడుతున్న రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి.

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా 100 రోజుల పాటు చేపడుతున్న రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని, కంటి వెలుగు పథకం మన ఇంటికే వెలుగు లాంటిదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ తెలిపారు. ఖమ్మం కార్పోరేషన్‌ 15వ డివిజన్‌ అల్లిపురం రైతు వేదిక, 24వ డివిజన్‌ శాంతి నగర్‌ల లోని మిషన్‌ హాస్పిటల్‌ నందు ఎర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని జిల్లా కలెక్టర్‌ వి. పి. గౌతమ్‌ తో కలసి మంత్రి ప్రారంభించారు.


ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ కంటి పరీక్ష జరిగేలా అధికారులు బాధ్యత తీసుకోవాలని ఆయన అన్నారు. మన ముఖ్యమంత్రివర్యులు ఎంతో ముందు చూపుతో తలపెట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని అందరు కలిసి విజయవంతం చేద్దామని ఆయన అన్నారు. రెండవ విడత కంటి వెలుగు ఖమ్మం ఖమ్మం జిల్లా నుండి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రులు అరవింద్‌ కేజ్రీవాల్‌, పినరయి విజయన్‌, కె.చంధ్రశేఖర్‌రావు అధ్వర్యంలో లాంఛనంగా ప్రారంభించుకున్నామని గుర్తు చేశారు. గ్రామాల్లో కంటి చూపు సమస్యతో బాధపడే వారి బాధలు తీర్చేందుకు ముఖ్యమంత్రి ఎంతో ముందు చూపుతో కంటి వెలుగు అనే ఈ గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారన్నారు. మొదటి విడత కంటి వెలుగు కార్యక్రమం ఎంతో అద్భుతంగా విజయవంతం అయిందన్నారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని, రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ప్రజలు కంటి చూపు పట్ల ఆశ్రద్ధ చేయకుండా ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని వినియోగించుకుని విజయవంతం చేయాలని అన్నారు. కంటి వెలుగు నిర్వహించేందుకు గ్రామంలో కావాల్సిన వసతులను స్థానిక ప్రజాప్రతినిధులు దగ్గరుండి ఆయా సౌకర్యాలు కల్పించి గ్రామంలో ఉన్న ప్రజలను కంటి పరీక్షలు చేసుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరినీ పంచాయతీ అధికారులు, నేతలు ఇంటికెళ్లి ఈ కార్యక్రమం దగ్గరకు తీసుకు వెళ్లి పరీక్షలు చేయించాలన్నారు. ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి, కళ్ళజోడు ఉచితంగా పంపిణీ, అలాగే అవసరం అయినా వారికి ఉచితంగా ఆపరేషన్‌ కూడా చేస్తారని ఆయన తెలిపారు. ఇంత మంచి కార్యక్రమాన్ని మనం అందరం కలిసి విజయవంతం చేయాలన్నారు. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికీ పరీక్ష జరిగేలా అధికారులు బాధ్యత తీసుకోవాలన్నారు.


దీర్ఘకాలంగా ఆల్లిపురం గ్రామంలో రైతులు ఎదుర్కొటున్న ఇనాం భూముల హక్కు సమస్యపై మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ చొరవతో పరిష్కారం లభించిందని, ఇనాం భూములు సాగు చేసుకుంటున్న అర్హులైన రైతులకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ (ఓ అర్ సి) ద్వారా ఆయా భూమి మీద హక్కు కల్పించడం పట్ల మంత్రి కు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.
జిల్లా కలెక్టర్‌ వి.పి. గౌతమ్‌ మాట్లాడుతూ అల్లీపురం గ్రామంలో ఎన్నో సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న ఇనాం భూములకు సంబంధించిన సమస్యను మన రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు ప్రత్యేక చొరవ తీసుకొని 60 మందికి (ఓ అర్ సి) ఇప్పించడం చాలా సంతోషకరమైన విషయమని తెలిపారు. రాష్ట్రంలో ఒ.ఆర్‌.సికి సంబంధించి ప్రక్రియ నిలుపుదల చేయడం జరిగిందని, మన జిల్లాలో ఉన్న సమస్యలను పరిష్కరించాలనే సంకల్పంతో రైతుల పక్షపాతిగా ఉండిమంత్రివర్యులు నేడు పట్టాలు అందించడం జరిగిందన్నారు.


అల్లీపురం గ్రామంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కేంద్రానికి పరిధిలో ఉన్న వారందరు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగపుర్చుకొని ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకొని కంటిచూపును కాపాడుకోవాలన్నారు. రీడింగ్, కుట్టుమిషన్‌, వెల్డింగ్‌ వర్క్స్‌ చేసే వారందరికి ఏదో చిన్న కంటి లోపం ఉంటుందని ఈ కార్యక్రమంలో పరీక్షలు చేయించుకొని నివారించుకోవాలని కలెక్టర్‌ కోరారు. రీడిరగ్‌, ప్రిస్‌కిప్షన్‌ కళ్లజోళ్లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు 3 లక్షల మందికి కంటి పరీక్షలు చేసి కళ్ళ జోడ్లను అందిచడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో నగర మేయర్‌ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్‌ బచ్చు విజయ్‌ కుమార్‌, అదనపు కలెక్టర్‌ ఎన్‌.మధుసూధన్‌, నగరపాలక సంస్థ కమిషనర్‌ ఆదర్శ్‌ సురభి, వ్యవసాయ మార్కెట్‌ కమిటి చైర్మన్‌ దోరెపల్లి శ్వేత, రెవిన్యూ డివిజన్‌ అధికారి రవీంద్రనాథ్‌, జిల్లా వైద్య ఆరోగ్య శాఖా అధికారి డాక్టర్‌ మాలతీ, డాక్టర్‌ బాలకృష్ణ, కార్పొరేటర్లు కమర్తపు మురళి, రావూరి కరుణ, వలరాజు,ఖమ్మం అర్బన్‌ తహసిల్దార్‌ శైలజ, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page