నూతన అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించిన ఫైర్ కాలనీ వార్డు మెంబర్ KP షఫీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం పేరాయిగూడెం పంచాయితీ పరోధిలో ఫైర్ కాలనీలో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ సెంటర్ ను ప్రారంభించిన స్థానిక వార్డు మెంబర్ కెపి. షఫీ. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి షఫీ మాట్లాడుతూ అందరికీ సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ సెంటర్లను నిర్వహిస్తున్న విషయం తెలిసినదేనని. చిన్న పిల్లలకు గర్భిణీ స్త్రీలకు, పౌష్టికాహారం అందించడంలో అంగన్వాడీ కేంద్రాలు ముఖ్య పాత్ర వహిస్తున్నాయని తెలియ జేశారు.కానీ ఈ కేంద్రానికి ముఖ్య సమస్య గత పన్నెండు సంవత్సరాలుగా ఈ అంగన్వాడీ కేంద్రానికి సంబంధించిన అంగన్వాడీ టీచర్ పోస్టుకు సంబంధించిన ఓ గొడవ ఇప్పటికి కోర్టులో ఉండడంతో ఈ కేంద్రంలో టీచర్ లేకపోవడంతో ఆయా మొత్తం చుసుకుంటున్నారని ఇక్కడ ఇంచార్జ్ టీచర్ కి కూడా రెండు సెంటర్లు చూసుకోవడం భారంగా ఉంటుందని,ఈ సమస్య మూలంగానే పిల్లలకు విద్య బోధన కరువవుతుందని, ఈ విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టి సారించి సమస్య పరిష్కరానికి పూనుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది,ప్రజాప్రతినిధులు,గర్భిణీ స్త్రీలు, కాలనీవాసులు పాల్గొన్నారు.