SAKSHITHA NEWS

రైతులు తడి, పొడి పద్ధతిలో వరి సాగు చేయాలి!

సాక్షిత తుంగతుర్తి! : రైతులు తడి, పొడి పద్ధతిలో వరి పంట సాగు చేయాలని స్వామి వివేకానంద గ్రామీణ అభివృద్ధి సంస్థ డైరెక్టర్ గౌస్ మియ అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలోని అన్నారం గ్రామంలో తడి, పొడి పద్ధతిలో వరి సాగుపై కోర్ కార్బన్ ఎక్సోల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ వారి నేతృత్వంలో స్వామి వివేకానంద గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మారుతున్న వాతావరణ పరిస్థితుల వలన భూగర్భ జలాలపై ఒత్తిడి పెరగటం వల్ల వ్యవసాయంలో నీటి సమర్థ యాజమాన్య పరిస్థితులను పాటించడం ఎంతో అవసరమన్నారు. తడి పొడి విధానం వలన మిథేన్ అనబడే కాలుష్యం విడుదల కాకుండా ఉంటుందని రైతులకు తడి, పొడి పద్ధతిలో వరి పంట సాగు చేయడానికి అన్ని సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. తడి, పొడి పద్ధతిలో వరి సాగు చేయడం వలన వరి పంట వేరు వ్యవస్థ బలంగా అభివృద్ధి చెంది బలమైన గాలులకు కింద పడిపోకుండా ఉంటుందని, దిగుబడి కూడా అధికంగా వస్తుందని అన్నారు. నీటి వినియోగ శాతం 17 నుండి 30 వరకు తగ్గుతుందని అన్నారు.ఈకార్యక్రమంలో సూపర్ వైజర్ యాకుబ్ నాయక్. అన్నారం గ్రామ సర్పంచ్ అనోక్ గారు.కోఆర్డినేటర్ సూర్యప్రకాష్ గ్రామ రైతులు పాల్గొన్నారు.

రైతులు తడి, పొడి పద్ధతిలో వరి సాగు చేయాలి!

రైతులు తడి, పొడి పద్ధతిలో వరి పంట సాగు చేయాలని స్వామి వివేకానంద గ్రామీణ అభివృద్ధి సంస్థ డైరెక్టర్ గౌస్ మియ అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలోని అన్నారం గ్రామంలో తడి, పొడి పద్ధతిలో వరి సాగుపై కోర్ కార్బన్ ఎక్సోల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ వారి నేతృత్వంలో స్వామి వివేకానంద గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మారుతున్న వాతావరణ పరిస్థితుల వలన భూగర్భ జలాలపై ఒత్తిడి పెరగటం వల్ల వ్యవసాయంలో నీటి సమర్థ యాజమాన్య పరిస్థితులను పాటించడం ఎంతో అవసరమన్నారు. తడి పొడి విధానం వలన మిథేన్ అనబడే కాలుష్యం విడుదల కాకుండా ఉంటుందని రైతులకు తడి, పొడి పద్ధతిలో వరి పంట సాగు చేయడానికి అన్ని సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. తడి, పొడి పద్ధతిలో వరి సాగు చేయడం వలన వరి పంట వేరు వ్యవస్థ బలంగా అభివృద్ధి చెంది బలమైన గాలులకు కింద పడిపోకుండా ఉంటుందని, దిగుబడి కూడా అధికంగా వస్తుందని అన్నారు. నీటి వినియోగ శాతం 17 నుండి 30 వరకు తగ్గుతుందని అన్నారు.ఈకార్యక్రమంలో సూపర్ వైజర్ యాకుబ్ నాయక్. అన్నారం గ్రామ సర్పంచ్ అనోక్ గారు.కోఆర్డినేటర్ సూర్యప్రకాష్ గ్రామ రైతులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS