అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి

Spread the love

Everyone who is eligible should take advantage of the government schemes

అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి…

రూ.39.35 లక్షల విలువ చేసే సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్…


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంకు చెందిన 47 మంది సీఎం రిలీఫ్ ఫండ్ పథకం లబ్ధిదారులకు రూ.39,35,500/- విలువ చేసే చెక్కులను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించి చింతల్ లోని తన కార్యాలయం వద్ద పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేదల సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయం అన్నారు. పేద ప్రజలకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. పేదలకు కూడా కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందాలనే ఉద్ధేశ్యంతో సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ద్వారా సహాయం అందిస్తున్నారని తెలిపారు.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో గడిచిన ఏళ్లుగా వేలాది మందికి లక్షల రూపాయలు మంజూరు చేయిస్తూ అందిస్తున్నామని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో నిజాంపేట్ డిప్యూటీ మేయర్ ధన్ రాజ్ యాదవ్, కార్పొరేటర్లు సురేష్ రెడ్డి, బాలాజీ నాయక్, మాజీ కార్పొరేటర్ బొడ్డు వేంకటేశ్వర రావు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ టి.లక్ష్మా రెడ్డి, మాజీ కౌన్సిలర్ సూర్యప్రభ, కోఆప్షన్ మెంబర్ సలీం, డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్, పోలే శ్రీకాంత్, సీనియర్ నాయకులు మక్సూద్ అలీ, చందు, జగన్, వేణు యాదవ్, ఫిరోజ్, సిద్ధిక్, పాక్స్ డైరెక్టర్ శ్రీనివాస్ యాదవ్, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page