Every day 150 people need to undergo eye examinations
ప్రతి రోజు 150 మందికి కంటి పరీక్షలు నిర్వహించాలి
- జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్
సాక్షిత ఖమ్మం :
రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంలో ప్రతి శిబిరంలో రోజుకు 150 మందికి కంటి పరీక్షలు నిర్వహించాలని, ఈ దిశగా ప్రజల సమీకరణ చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లాలోని ఎంపిడివో లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులతో కంటి వెలుగు కార్యక్రమంపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ప్రతి శిబిరంలో రోజుకు సరాసరి పరీక్షలపై సమీక్షించి, తక్కువ పరీక్షలు జరుగుచున్న చోట జన సమీకరణకు కలెక్టర్ సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటికే రూపొందించిన మైక్రో కార్యాచరణ మేరకు జన సమీకరణ చేయాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ శిబిరానికి వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఆయా శిబిరం కు సంబంధించిన వారు కాక, ఇతర ప్రాంతాల వారు వచ్చిన పరీక్షలు చేయాలన్నారు. కొన్ని శిబిరాల్లో మాత్రమే లక్ష్యం మేరకు సేకరణ జరగలేదని అక్కడ ప్రత్యేక దృష్టి పెట్టాలని, లక్ష్యం మేరకు నడుచుచున్న చోట, ఇదే ఒరవడిని కొనసాగించాలని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహాలత మొగిలి, ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, జిల్లా వైద్య, ఆరోగ్యాధికారిణి డా. బి. మాలతి, జెడ్పి సీఈఓ వివి. అప్పారావు, డిఆర్డీఓ విద్యాచందన, ఉప వైద్య, ఆరోగ్యాధికారి డా. రాంబాబు, ప్రాజెక్ట్ అధికారులు డా. సైదులు, డా. వెంకట నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.