Estimated cost of Rs.(372.16 Lakhs) Three Crore Seventy Two Lakh Sixteen Thousand Rupees in Sai Charan Colony
సాక్షిత : ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని అంబేద్కర్ నగర్, శంశిగుడా, కాజా నగర్, ఎన్టీఆర్ నగర్, ఆల్విన్ కాలనీ ఫేస్ 2, ధరణి నగర్,పంచమి కాలనీ, HMT శాతవాహన నగర్, సాయి చరణ్ కాలనీ ల లో రూ.(372.16 లక్షలు) మూడు కోట్ల డెభై రెండు లక్షల పదహారు వేల రూపాయల అంచనావ్యయం తో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్లు మరియు స్మశాన వాటిక ల అభివృద్ధి నిర్మాణ పనులకు కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్ , నార్నె శ్రీనివాస రావు కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేసిన గౌరవ ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ఒకవైపు కరోనా మహమ్మారి వంటి విపత్కర పరిస్థితుల్లో అభివుద్ది ఆగకూడదనే ఉద్దేశ్యం తో సంక్షేమం మరియు అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ముఖ్యమంత్రి కెసిఆర్ మార్గదర్శకం లో మంత్రి KTR సహకారం తో శేరిలింగంపల్లి నియోకజకర్గంను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన ,అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదితానని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.
అదేవిధంగా ఆల్విన్ కాలనీ డివిజన్ అభివృద్ధికి బాటలు వేస్తూ సీసీ రోడ్లు మరియు స్మశాన వాటికల అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసుకోవడం చాల సంతోషకరం అని అదేవిధంగా మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని ,
స్మశాన వాటికలలో సకల సదుపాయాలతో సుందరవనంగా మరో మహా ప్రస్థానం లాగా తీర్చిదిద్దుతామని, ఈ స్మశాన వాటికలో అంత్యక్రియల ఫ్లాట్ ఫారం, అడ్మినిస్ట్రేషన్ భవనం, మంచి నీటి బోరు ,అంతర్గత రోడ్లు ,టాయిలెట్లు ,వాటర్ ఫౌంటైన్,స్నానాల గదులు ,
మనిషి జీవిత చరిత్ర సైకిల్ ( మనిషి పుట్టుక నుండి మరణించే వరకు తెలిపే జీవిత చక్రం ను చిత్రాల తో కూడిన గోడను మరియు సమాశం వాటిక చుట్టూ ప్రహరీ గోడను నిర్మిస్తున్నామని అదేవిధంగా ఆహ్లాదకరమైన, ప్రశాంత వాతావరణం కలిపించి త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని,మనిషి మరణాంతరం చివరి దశలో అంత్యక్రియలు సజావుగా ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అన్ని రకాల వసతుల కలిపించాలని అదేవిధంగా సీసీ రోడ్లు నిర్మాణం
పనులు స్మశాన వాటిక అభివృద్ధి పనులు నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని,నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని, పనులు త్వరిత గతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు .
నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని ,అన్నివేళలా ప్రజలకు అందుబాటులోకి ఉంటానని ,మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని ,నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ప్రభుత్వ విప్ గాంధీ పునరుద్ఘాటించారు.
శంకుస్థాపన చేసిన కార్యక్రమాల వివరాలు :
1.అంబేద్కర్ నగర్ లో రూ.120 లక్షల రూపాయల అంచనావ్యయం తో చేపడుతున్న స్మశాన వాటిక సుందరికరణ మరియు అభివృద్ధి పనులు
2.శంశిగుడా లో రూ.100 లక్షల రూపాయల అంచనావ్యయం తో చేపడుతున్న స్మశాన వాటిక సుందరికరణ మరియు అభివృద్ధి పనులు
3.ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని కాజా నగర్, ఎన్టీఆర్ నగర్, ఆల్విన్ కాలనీ ఫేస్ 2, ధరణి నగర్,పంచమి కాలనీల లో రూ.(80.10 లక్షలు) ఎనభై లక్షల పది వేల రూపాయల అంచనావ్యయం తో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనులు
4.ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని HMT శాతవాహన నగర్ మరియు సాయి చరణ్ కాలనీ లలో రూ.(72.06 లక్షలు) డెబ్భై రెండు లక్షల ఆరు వేల రూపాయల అంచనావ్యయం తో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనులు.
పైన పేర్కొన్న స్మశాన వాటికల అభివృద్ధి నిర్మాణ పనులకు మరియు సీసీ రోడ్ల నిర్మాణం పనులకు శంకుస్థాపన చేయడం జరిగినది అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఆల్విన్ కాలనీ డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి,మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ ,హఫీజ్పెట్ డివిజన్ అధ్యక్షులు బాలింగ్ గౌతమ్ గౌడ్,ఆల్విన్ కాలనీ డివిజన్ మాజీ అధ్యక్షులు జిల్లా గణేష్, ఉపాధ్యక్షులు కాశినాథ్ యాదవ్ మరియు రాజేష్ చంద్ర, ప్రధాన కార్యదర్శి గుడ్ల శ్రీనివాస్, మహిళా అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి,
తెరాస నాయకులు జోగిపేట భాస్కర్ , షౌకత్ అలీ మున్నా, కైసర్, జె.భాస్కర్, బోయా సురేందర్, రవీందర్, అగ్రవాసు, యాదగిరి, రాములుగౌడ్, నరసింహులు, సిద్దయ్య, సత్యనారాయణ, రాజుపటేల్, మహేష్, దుర్గేష్, వెంకటేష్, వాలి నాగేశ్వరరావు, లక్ష్మమ్మ, అంజలి, గౌస్, ఖాజా, నజీర్, ఖలీమ్, ఇంతియాజ్, దాతి రమేష్,
మల్లేష్ ముదిరాజ్, వెంకటకృష్ణ, లలన్, సాయి కిరణ్, కాసాని శంకర్, సురేష్, రవీందర్, రాములు, నారాయణ, వెంకటేష్, కూర్మయ్య, జనయ్య, జె.ఈశ్వర్ గౌడ్, సదానందం, ఐ.వి శ్రీనివాస్, యాది రెడ్డి, మదన్ మోహన్, కృష్ణ మోహన్, హనుమంత్, రాజు, కృష్ణ మూర్తి, వెంకట రామిరెడ్డి, జి.కృష్ణ, రామ్మోహన్, మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.