Estimated cost of Rs.1.90 One Crore Ninety Lakh at Vaddepally Enclave
సాక్షిత : వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వడ్డేపల్లి ఎనక్లేవ్ వద్ద రూ.1.90 ఒక కోటి తొంబై లక్షల రూపాయల అంచనావ్యయం తో చేపడుతున్న వడ్డేపల్లి ఎనక్లేవ్ నుండి మాధవరం నగర్ కాలనీ హై టెన్షన్ లైన్ కింద నాల మీద కల్వర్టు నిర్మాణ పనులకు మరియు దీనబంధు కాలనీ బ్రిడ్జి దగ్గర నుండి జగద్గిరిగుట్ట ఇందిరా గాంధీ విగ్రహం వరకు సిమెంటు రోడ్డు నిర్మాణ పనులకు కార్పొరేటర్ శ్రీమతి రోజాదేవి రంగరావు తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ఎన్నో ఏండ్ల సమస్య నేటి తో తిరినది అని, వడ్డేపల్లి ఎనక్లేవ్ నుండి మాధవరం నగర్ కాలనీ హై టెన్షన్ లైన్ కింద నాల మీద కల్వర్టు నిర్మాణ పనులతో ఇక్కడి ప్రాంత ప్రజలకు, కాలనీ వాసులకు ఎంతో ఉపశమనం కలుగునని ప్రయాణం దూరం, సమయం ,ఇంధనం ఆదా అవునని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.
అదేవిధంగా ఒకవైపు కరోనా మహమ్మారి వంటి విపత్కర పరిస్థితుల్లో అభివుద్ది ఆగకూడదనే ఉద్దేశ్యం తో సంక్షేమం మరియు అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ముఖ్యమంత్రి కెసిఆర్ మార్గదర్శకం లో మంత్రి KTR సహకారం తో శేరిలింగంపల్లి నియోకజకర్గంను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన ,అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదితానని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.
అదేవిధంగా వివేకానంద నగర్ డివిజన్ అభివృద్ధికి బాటలు వేస్తూ కల్వర్ట్ నిర్మాణం పనులకు మరియు సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసుకోవడం చాల సంతోషకరం అని, కాలనీ లలో వర్షాలకు దెబ్బ తిన్న రోడ్ల ను పునరుద్ధరించడమే ధ్యేయం గా రోడ్ల నిర్మాణం పనులకు శంకుస్థాపన చేయడం జరిగినది అని అన్ని కాలనీ లలో మెరుగైన మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నాం అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.
అదేవిధంగా మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని ,కల్వర్ట్ నిర్మాణం మరియు సీసీ రోడ్ల వంటి అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని ,నాణ్యత విషయంలో ఎక్కడ రాజి పడకూడదని , ప్రజలకు ట్రాఫిక్ రహిత ,సుఖవంతమైన ,మెరుగైన రవాణా సౌకర్యం కొరకు శాయ శక్తుల కృషి చేస్తానని,అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని, అన్ని రకాల మౌలిక వసతుల తో, అన్ని హంగులతో, సకల సౌకర్యాలతో సుందర శోభిత వనాలుగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వ విప్ గాంధీ చెప్పడం జరిగినది.
పనుల్లో జాప్యం లేకుండా త్వరిత గతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని గాంధీ అధికారులను ఆదేశించడం జరిగినది , ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కలిపిస్తామని ,ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సుఖవంతమైన ప్రయాణానికి బాటలు వేస్తామని ప్రభుత్వ విప్ గాంధీ చెప్పడం జరిగినది.
నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని ,అన్నివేళలో ప్రజలకు అందుబాటులోకి ఉంటానని ,మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని ,నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ప్రభుత్వ విప్ గాంధీ పునరుద్ఘాటించారు.
శంకుస్థాపన చేసిన కార్యక్రమాల వివరాలు :
మంజూరైన అభివృధి పనుల వివరాలు…
1.వడ్డేపల్లి ఎనక్లేవ్ నుండి మాధవరం నగర్ కాలనీ హై టెన్షన్ లైన్ కింద నాల మీద కల్వర్టు నిర్మాణ పనులు
2.దీనబంధు కాలనీ బ్రిడ్జి దగ్గర నుండి జగద్గిరిగుట్ట ఇందిరా గాంధీ విగ్రహం వరకు సిమెంటు రోడ్డు నిర్మాణ పనులు
పైన పేర్కొన్న కల్వర్టు నిర్మాణం మరియు సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం జరిగినది అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగరావు , బీఆర్ ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు సంజీవ రెడ్డి,బీఆర్ఎస్ పార్టీ నాయకులు నాయి నేని చంద్రకాంత్ రావు, మాచర్ల భద్రయ్య, భగవాన్, ఆంజనేయులు, సతీష్, చంద్రమోహన్ సాగర్, ఎర్రలక్ష్మయ్య, కాలనీల అసోసియేషన్, దశరథ్ రెడ్డి, రమణ రెడ్డి, మోహన్ రావు, వెంకట్ రెడ్డి,రాము,పణి ,సంపత్, శ్రావణి రెడ్డి ,స్వరూప ,రాధ బాయి, బారతమ్మ, లక్ష్మీ, సభ్యులు అనుబంధ సంఘాల ప్రతినిధులు ,కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు .