ఉద్యోగుల ఆరోగ్య భద్రత మా బాధ్యత

Spread the love
Employee health and safety is our responsibility

ఉద్యోగుల ఆరోగ్య భద్రత మా బాధ్యత

షాద్ నగర్ ఆర్టీసీ డిపోలో గ్రాండ్ హెల్త్ క్యాంపు

సూపరింటెండెంట్ తో కలసి ప్రారంభించిన డిపో మేనేజర్.

సాక్షిత షాద్ నగర్ : ఉద్యోగుల ఆరోగ్య భద్రత మా బాధ్యత అని అన్నారు డిపో మేనేజర్ శ్రీమతి సురేఖ.ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న ఉద్యోగుల కోసం ప్రభుత్వ ఆస్పత్రి,మన షాద్ నగర్ ఆర్టీసీ డిపో సంయుక్త ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ఇందులో భాగంగా మంగళవారం షాద్ నగర్ ఆర్టీసీ డిపోలో గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు,సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి,రమేష్ భండారి,డాక్టర్ నీలతో కలిసి మేనేజర్ సురేఖ ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,,,ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశాల మేరకు గాను ఉద్యోగులు ఆరోగ్యంగా ఉంటేనే సేవలు అందించేందుకు వీలుగా ఉంటుందని,ఉద్యోగుల ఆరోగ్య భద్రత మా ప్రథమ కర్తవ్యం అని గుర్తు చేశారు

.ప్రత్యేక హెల్త్ క్యాంపులో భాగంగా ఉద్యోగులకు 18 రకాల పరీక్షలు నిర్వహిస్తామని,ఈ క్యాంపు నేటి నుండి 12వ తేదీ వరకు కొనసాగుతోందని మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.ఈ కార్యక్రమంలో షాద్ నగర్ ఆర్టీసీ అసిస్టెంట్ మేనేజర్.కే.ఆనంద్ రావు,కృష్ణయ్య,అర్జున్,సీఆర్సి.వెంకటేష్,వెల్ఫేర్ బోర్డ్ సభ్యులు వాహిద్,ఆర్టీసీ ఉద్యోగులు,సిబ్బంది,తదితరులు ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page