భీమడోలు వద్ద బొలెరో వాహనాన్ని దురంతో ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది

Spread the love

భీమడోలు,ఏలూరు జిల్లా) భీమడోలు వద్ద బొలెరో వాహనాన్ని దురంతో ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది. రైలు సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. గురువారం వేకువజామున సుమారు 3 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. దీంతో 5 గంటలకు పైగా రైలు నిలిచిపోయింది.
దురంతో ఎక్స్ప్రెస్ వస్తుండటంతో భీమడోలు జంక్షన్ వద్ద రైల్వే గేటును సిబ్బంది వేశారు. అదే సమయంలో బొలెరోలో వచ్చిన కొంతమంది వ్యక్తులు వాహనంతో రైల్వే గేటును ఢీకొట్టి వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆ వాహనం రైల్వే ట్రాక్పైకి వచ్చింది. అదే సమయంలో దురంతో ఎక్స్ప్రెస్ సమీపించడంతో సదరు వ్యక్తులు బొలెరో వాహనాన్ని అక్కడే వదిలేసి పారిపోయారు. రైలు ఢీకొనడంతో ఆ వాహనం ధ్వంసమైంది.
రైలు ఇంజిన్ దెబ్బతినడంతో మరో ఇంజిన్ అమర్చేందుకు రైల్వే సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. దురంతో ఎక్స్ ప్రెస్ రైలు ప్రయాణికులు కొందరు ప్రత్యామ్నాయ మార్గాల్లో బయల్దేరి వెళ్లారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు. బొలెరో వాహనంలో వచ్చినవాళ్లు దొంగలా…!? పారిపోయే క్రమంలో గేటును ఢీకొట్టారా…!? లేదా మరేదైనా కారణమా? అనే కోణంలో రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు. దుండగుల కోసం గాలింపు చేపట్టారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page