ఖమ్మం డిస్ట్రిక్ట్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్

Spread the love

ఖమ్మం నగరం లో వైరా రోడ్డులో ఖమ్మం డిస్ట్రిక్ట్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ నూతన కార్యాలయాన్ని ప్రముఖ చిన్న పిల్లల డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్ ప్రారంభించారు . ఆయన మాట్లాడుతూ ల్యాబ్ టెక్నీషియన్స్ అందరూ కలిసి ఒక యూనిట్ గా ఉండి వారి సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. అర్హులైన ల్యాబ్ టెక్నీషియన్లకు తమ వంతు సహాయ సహకారాలు ఎల్లవేళల్లో ఉంటాయన్నారు .

డాక్టర్లు మరియు సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్ లతో ఐక్యమత్యంగా , కలిసిమెలిసి ఉండాలి అన్నారు . లీడ్ తీసుకుని సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్ లతో సమావేశాలు నిర్వహించి ట్రైనింగ్ క్యాంపులు పెట్టి వారి సలహా సూచనలు తీసుకోవాలన్నారు. ఈ అసోసియేషన్ మరింత బలోపేతంగా ముందుకు కొనసాగాలని ఆకాంక్షించారు . ఈ సందర్భంగా ల్యాబ్ టెక్నీషియన్ అందరికీ హార్థిక శుభాకాంక్షలు తెలిపారు . ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ గుండెపోటు నరేష్, వైస్ ప్రెసిడెంట్ మద్దేల వినయ్ కుమార్, సెక్రటరీ క్రాంతికుమార్, లవ్ కుమార్, ట్రీజరర్ వంకాయల నవీన్, శ్రీనివాస్, మోహన్ రావు, కిరణ్, మోహనరావు మరియు ల్యాబ్ టెక్నీషియన్స్ అందరు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page