SAKSHITHA NEWS

Does Muai get three meals for three rupees?

ముపై మూడు రూపాయలకే మూడు పూటల భోజనం వస్తుందా.. ?*
బంగారు తెలంగాణాలో హాస్టల్ విద్యార్థుల బతుకులు ఆగమ్యగోచరం

ప్రభుత్వ ఎస్సి హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు, పౌష్టికాహార లోపం

బీజేపీ రాష్ట్ర నాయకులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి
రంగా రెడ్డి జిల్లా సాక్షిత ప్రతినిధి*

హాస్టల్ విద్యార్థుల బతుకులు ఆగమ్య గోచరంగా తయారవుతున్నాయని, 30 రూపాయలకే మూడు పూటలా భోజనం పెడుతున్నారని ఇదెక్కడి దుర్మార్గమని బిజెపి రాష్ట్ర నాయకులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బీజేపీ తెలంగాణా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు బీజేపీ రంగారెడ్డి జిల్లా ఎస్సి మోర్చా ఉపాధ్యక్షులు ఎంకనోళ్ళ వెంకటేష్ ఆధ్వర్యంలో బుధవారం షాద్ నగర్ పట్టణంలోని సమీకృత ఎస్సి హాస్టల్ ను సందర్శించారు

నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి మరియు బీజేపీ సీనియర్ నాయకులు అందే బాబయ్య, బీజేపీ సీనియర్ నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎస్సి హాస్టల్లో మౌళిక సదుపాయాలు పరిశుభ్రత పౌష్టికాహారం అందించడంలో విఫల మౌతున్నాయిని విద్యార్థుల చదువులు అగమ్యగోచరంగా మారిందని అన్నారు. ఒక విద్యార్థిపైన ప్రభుత్వం ఖర్చుపెడుతున్న ముపై మూడురూపాయలు ఈ రోజుల్లో ఏం సరిపోతుంది.

కనీసం ఒక విద్యార్థి పైన నెలకు 2500 రూపాయలు అందించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కేజీ టూ పిజి ఉచిత నిర్బంధ విద్య అమలు చేయకపోగా, పేద పిల్లలు చదువుకునే ఈ హాస్టల్లో వారికి కనీస సౌక్యర్యాలు కల్పించి పేద విద్యార్థులు చదువుకునేందుకు ప్రోత్సహించాల్సింది పోయి, వారు చదువుకుంటే ఎక్కడ బాగుపడతారో అనే దురుద్దేశ్యమే మెండుగా కనిపిస్తున్నాయని విమర్శించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ కు వెనకబడిన తరగతుల వసతి గృహాలపైన ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్థం అవుతుంది అని అన్నారు. అందే బాబయ్య మాట్లాడుతూ పేద పిల్లలకు అందించాల్సిన పౌష్టికాహారం ఏమాత్రం బాగులేవని పప్పుకూర మొత్తం నీళ్ల మాదిరి ఉందని పిల్లలకు చలికాలం అందించాల్సిన వసతులు బాగాలేవని, రాత్రిపూట దోమలతో పిల్లలు బాధపడుతున్నారని తెలిపారు

. ప్రభుత్వ ఎస్సి హాస్టళ్లను ఒక లెక్క కాకుండా పేదపిల్లలు తమ సొంత ఇంట్లో ఉంటున్న అనుభూతిని ఇవ్వాలని అన్నారు. పేద విద్యార్థుల జీవితాలతో చలగాటం ఆడుతున్న కేసీఆర్ మొండి వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లి తెలంగాణా రాష్ట్రంలో బీజేపీ పార్టీని అధికారంలోకి తెస్తామని పేద ప్రజల జీవితాలు వారి పిల్లల చదువుల అభివృద్ధికి కావాల్సిన కార్యక్రమాలు చేపట్టి పేద పిల్లలను చదువుకు దగ్గరచేస్తామని అన్నారు.

పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పేద విద్యార్థులకు కావాల్సిన నిధుల పంపిస్తుంటే వాటిని పక్కదారి మల్లిస్తూ ఎస్సి హాస్టళ్లలో చదువుకునే విద్యార్థులకు కనీస అవసరాలు తీర్చడం లేదని, పిల్లలకు కావాల్సిన యూనిఫార్మ్ బూట్లు ఇవ్వడం లేదని ఎందుకని ప్రశ్నించారు. చదుకొని ప్రయోజకులుగా ఉన్నతమైన ఉద్యోగులుగా ఎదగాల్సిన ఈ చిరు ప్రాయములో విద్యార్థులకు ఉన్నతమైన విద్యనే కాకుండా వారు ఉంటున్న హాస్టళ్లను అభివృద్ధి చేస్తూ వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలను అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని అన్నారు.

నిర్లక్ష్యం చేస్తే బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సి మోర్చా మండల అధ్యక్షులు విట్యాల నర్సింలు, పట్టణ అధ్యక్షులు మఠం ఋషికేశ్, ఫరూక్ నగర్ మండల అధ్యక్షులు దొడల వెంకటేష్,యువమోర్చా జిల్లా ఉపాధ్యక్షులు ప్యాట అశోక్,తదితరులు పాల్గొన్నారు..


SAKSHITHA NEWS