ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలి.-జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

Spread the love

ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. నూతన కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో భూ రక్షణా బృందాలతో ప్రభుత్వ స్థలాల పరిరక్షణపై కలెక్టర్ సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విలువైన ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వ స్థలాల గుర్తింపు చేసి, అట్టి జాబితాను తగుచర్యల నిమిత్తం భూ రక్షణా బృందాలకు అందజేసినట్లు, వాటిపై తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలన్నారు. సమీక్షలో స్థలాల వారిగా అధికారులు చేపట్టిన చర్యలపై కలెక్టర్ సమీక్షించారు. ఖాళీ స్థలాల్లో క్రమబద్ధీకరణ జీవో 59 లో చేసుకున్న దరఖాస్తులు తిరస్కరణకు గురయిన చోట వెంటనే స్థలాలు స్వాధీనం చేసుకొని, ఫెన్సింగ్, సిసి కెమెరాల ఏర్పాటుచేసి, రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. బృందాలు క్షేత్ర పరిశీలన చేసి చర్యలు తీసుకోవాలని అన్నారు. బృందాలు క్రియాశీలకంగా పనిచేయాలని, ప్రతి ప్రభుత్వ స్థలం పరిరక్షణ చేయాలని అన్నారు. వైఎస్సార్ కాలనిలో ఎక్స్ సర్వీస్ మెన్ లకు కేటాయించిన అసైన్డ్ భూమిపై సర్వే చేసి సమగ్ర నివేదిక సమర్పించాలన్నారు. ఎన్ని ప్లాట్లు ఉన్నవి, ఎన్ని ప్లాట్లలో నిర్మాణాలు ఉన్నవి, ఎన్ని ఖాళీ ప్లాట్లు ఉన్నది తనిఖీలు చేయాలన్నారు. ప్లాట్ల విషయమై ఆధారాలకు నోటీసులు ఇవ్వాలన్నారు. పువ్వాడ ఉదయ్ నగర్ లో ఖాళీ ప్లాట్ల విషయమై చర్యలు చేపట్టాలన్నారు. టేకులపల్లి డబల్ బెడ్ రూమ్ ఇండ్లలో లబ్ధిదారులు నివాసం లేని వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ స్థలాల్లో ఉన్న నిర్మాణాలు గుర్తించి తొలగించాలన్నారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు బి. సత్యప్రసాద్, డి. మధుసూదన్ నాయక్, ఖమ్మం నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభి, శిక్షణా సహాయ కలెక్టర్లు మయాంక్ సింగ్, యువరాజ్, ఖమ్మం ఆర్డీవో జి. గణేష్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడి శ్రీనివాసులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page