పువ్వాడ ఫౌండేషన్ అధ్వర్యంలో హెల్త్ కార్డ్స్ పంపిణి..

Spread the love

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

ఖమ్మం నియోజకవర్గం రఘునాధపాలెం మండల చర్చ్ పాస్టర్స్ కు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హామీ మేరకు మమత ఆసుపత్రిలో ఉచిత వైద్యం నిమిత్తం 85 మంది చర్చ్ పాస్టర్ కు హెల్త్ కార్డ్స్ ను వీడియోస్ కాలనీ క్యాంపు కార్యాలయంలో పంపిణి చేశారు. ఆయా హెల్త్ కార్డ్స్ ను సుడా చైర్మన్ విజయ్ కుమార్, మంత్రి పీ ఏ రవి కిరణ్, మండల నాయకులు మందడపు నర్సింహరావు, రఘునాథపాలెం మండల పాస్టర్ కమిటీ చైర్మన్ మంద సంజీవరావు తదితరులు పంపిణి చేశారు. మమత ఆసుపత్రిలో పాస్టర్స్ కు ఉచిత వైద్య సేవలు అందించాలని ఇటీవలే పాస్టర్స్ కలిసి చేసిన విజ్ఞప్తి మేరకు స్పందించిన మంత్రి పువ్వాడ అందుకు అంగీకరించి మమత ఆసుపత్రిలో ఉచిత వైద్యం కోసం హెల్త్ కార్డ్స్ ను మంజూరు చేశారని వారు పేర్కొన్నారు. ప్రస్తుతం వైద్యం అత్యంత ఖరీదు అయిందని, సామాన్యులు ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి చికిత్సలు చేసుకునే పరిస్థితి లేదని పాస్టర్స్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తమ విజ్ఞప్తిని సానుకూలంగా స్పందించి మమత ఆసుపత్రిలో ఉచిత వైద్యం అందించేందుకు ముందుకు వచ్చిన పువ్వాడ ఫౌండేషన్, ఆసుపత్రి చైర్మన్, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కి పాస్టర్స్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పాస్టర్స్ జాన్ కాంతారావు, రత్నం, తిమోతి , ఇమ్మనియల్, లాజర్, సామియేలు తదితరులు ఉన్నారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page