ఉత్తమ ఫలితాలతో ఉజ్వల భవిష్యత్తును రూపొందించుకోవచ్చు : ఎమ్మెల్యే కేపీ. వివేకానంద

Spread the love

ఉత్తమ ఫలితాలతో ఉజ్వల భవిష్యత్తును రూపొందించుకోవచ్చు : ఎమ్మెల్యే కేపీ. వివేకానంద …
పదవ తరగతి ఫలితాల్లో సత్తా చాటిన ఠాగూర్ హైస్కూల్ విద్యార్థులు….*


సాక్షిత : కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద ఐడిపిఎల్ కు చెందిన ఠాగూర్ హై స్కూల్ విద్యార్థులు పదవ తరగతి ఫలితాల్లో 10/10 జిపిఏ సాధించిన సందర్భంగా కుత్బుల్లాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టంగా చదివినప్పుడు ఉత్తమ ఫలితాలతో రానున్న ఉజ్వల భవిష్యత్తులో అద్భుతాలు సృష్టించవచ్చని అన్నారు. ఈ సందర్భంగా 10/10 జిపిఏ సాధించిన ఇద్దరు విద్యార్థులు, 9/10 జిపిఏ సాధించిన 12 మంది విద్యార్థులను ఎమ్మెల్యే కేపీ. వివేకానంద అభినందించారు.

ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ బండారి సాయికుమార్, డైరెక్టర్ బండారి నేహా, విజయ్ కుమార్, చైతన్య, నారాయణ రావు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page