రామగుండం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో దుప్పట్లు, పండ్లు,ఫలాల పంపిణీ

Spread the love

Distribution of blankets, fruits and vegetables under the auspices of Ramagundam Press Club

రామగుండం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో దుప్పట్లు, పండ్లు,ఫలాల పంపిణీ

సాక్షిత,పెద్దపల్లి,
క్రిస్మస్ పండగ సందర్భంగా పెద్దపల్లి జిల్లా రామగుండం ప్రెస్ క్లబ్ వారు రామగుండం ఏరియాలో అతి పేద క్రిస్టియన్లకు, వృద్దులకు, నిరాశ్రయులకు దుప్పట్లు, పండ్లు,ఫలాలను అందజేయడం జరిగింది.

ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎస్.కె. జమీల్ హుస్సేన్ మాట్లాడుతూ జర్నలిస్టుల శ్రేయస్సే కాకుండా సమాజ సేవ భావంతో ప్రారంభించిన ప్రెస్ క్లబ్ తరుపున ఇలాంటి మరెన్నో సేవ కార్యక్రమాలు నిర్వహించుతామని అన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు కొండ్ర అంజయ్య, ప్రధాన కార్యదర్శి పర్కాల లక్ష్మీనారాయణ గౌడ్ కార్యనిర్వహణ కార్యదర్శి కల్వల అనిల్ కుమార్, కోశాధికారి రవీందర్, జాయింట్ సెక్రటరీ జలీల్, ప్రెస్ క్లబ్ సభ్యులు దార మధు, జీవన్ తో పాటు ప్రగతి శీల తల్లి దండ్రుల సంఘము జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page