రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్,

Spread the love

Deputy Mayor Dhanraj Yadav who started the second phase of Kanti Velam programme.

కంటికి కొత్త వెలుగు

రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, స్థానిక కార్పొరేటర్ సురేష్ రెడ్డి

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 8వ డివిజన్ ఆదిత్య లగూన్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు రెండో విడతలో భాగంగా కంటి పరీక్ష శిబిరంను నిజాంపేట్ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ , స్థానిక కార్పొరేటర్ సురేష్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా కంటి పరీక్ష చేసుకున్న వారికి ఉచితంగా అద్దాలు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా నిరుపేద, ధనిక, కులమతాల తేడా లేకుండా అవసరం ఉన్న ప్రతి ఒక్కరికీ ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, ఉచితంగా అద్దాలు, అవసరమైతే ఆపరేషన్లు సైతం ఉచితంగా చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రతిష్ట, గౌరవం పెంచడంతో పాటు ప్రజలకు సేవ చేస్తున్నారని అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలు బాగున్నాయని ఇతర రాష్ట్రాలు కూడా అనుసరిస్తున్నాయన్నారు. ఈ చక్కటి పథకాన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు నిర్మల, జ్యోతి, సూపర్వైజర్ వానకుమారి, చంద్రకళ, నిలమ్మ , సంబంధిత సిబ్బంది, తస్థానిక వాసులు, దితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page