ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో రైతులకు తీవ్ర నష్టం – దైద రవీందర్

Spread the love

ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో రైతులకు తీవ్ర నష్టం – దైద రవీందర్

నకిరేకల్ సాక్షిత ప్రతినిధి

ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి తోనే అకాల వర్షాలతో ధాన్యం తడిసి రైతులు ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ నకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జి దైద రవీందర్ అన్నారు. నోముల గ్రామంలోని ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని దైద రవీందర్ సందర్శించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుల ధాన్యం మొత్తం అకాల వర్షాలతో తడిసి నీటిలో వడ్లు కొట్టుకొని పోవటానికి కారణం ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే కారణం మార్చి మొదటి వారం నుండి రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలను తీసుకొని వస్తున్న కాంగ్రెస్ పార్టీ కొనుగోళ్లు వేగవంతం చేయాలని కోరిన నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఇప్పటికైనా వెంటనే తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేయాలని నకిరేకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఎంపిటిసి
సామ మల్లమ్మ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సామ రవీందర్ రెడ్డి, నోముల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాదిని సోమయ్య గౌడ్, గ్రామ వర్కింగ్ ప్రెసిడెంట్ కనుకుల సంతోష్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు యానాల ఇంద్రారెడ్డి, ఆలగడప నాగరాజు, సామ రాజు, యాస మహేష్ రెడ్డి, సామ వెంకటరెడ్డి , ఎరుకల రవి , పగిళ్ల నరేష్ , నోముల గ్రామ రైతులు చామల వెంకట్ రెడ్డి , సప్పిడి వెంకట్ రెడ్డి , చింతల శంబయ్య, మత్స్య పార్వతమ్మ , జానకమ్మ , కందాల సుగుణమ్మ గ్రామ నాయకులు యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page