పిడికిలెత్తిన ధైర్యం ‘‘మే డే’’

Spread the love
  • శ్రమ చేద్దాం.. శ్రమను గుర్తిద్దాం.. శ్రమను గౌరవిద్దాం..

మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండల్ ఔషపూర్ గ్రామంలో కార్మిక దినోత్సవం సందర్భంగా గ్రామ పంచాయతీ సిబ్బంది, కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కార్మిక దినోత్సవం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఎంపీపీల ఫోరం అధ్యక్షులు, ఘట్కేసర్ మండల ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి మాజీ గ్రామ సర్పంచ్ కావేరి మచ్చేందర్ రెడ్డి తో కలిసి జండావిష్కరణలో పాల్గొని కార్మికులకు కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.బానిసత్వం, వెట్టిచారికికి వ్యతిరేకంగా, శ్రమదోపిడీని ఎదురిస్తూ కార్మిక లోకం కీలక హక్కులు సాధించుకున్న దినం మే డే శ్రమకు తగిన గుర్తింపు,సరైన వేతనం,రోజుకు 8 గంటల పని హక్కును కార్మికులు పోరాడి సాధించుకున్న ను ప్రపంచ కార్మిక దినోత్సవంగా జరుపుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి సభ్యులు ఏనుగు లక్ష్మారెడ్డి, మాజీ సర్పంచ్ రమేష్, మాజీ ఉపసర్పంచ్ ఐలయ్య యాదవ్, మాజీ వార్డు సభ్యులు శ్రీనివాస్ గౌడ్, వీరేశం, నాయకులు మచ్చేందర్ రెడ్డి, కొండల్ రెడ్డి, రామ్ రెడ్డి, జంగయ్య ముదిరాజ్, వమన్ రెడ్డి, మహేష్, కార్మిక సంఘం నాయకులు, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామ పెద్దలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page