చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్

Spread the love

Corporator Sabiha Ghausuddin was the chief guest at Chakali Ailamma’s birthday function

సాక్షిత : కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని పర్వత్ నగర్ ఆటో స్టాండ్ వద్ద రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ మరియు మేడ్చల్ జిల్లా మైనారిటీ అధ్యక్షులు మహమ్మద్ గౌసుద్దీన్ , పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, బహుజన వర్గాల స్ఫూర్తి ప్రదాత, మహిళా చైతన్యానికి ప్రతీకగా నిలిచిన చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా వారికి మా ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తెరాస రాజు రజక, విష్ణు, బ్రహ్మం, కళ్యాణ్, రాము, సైదులు, సుంకన్న, శేఖర్, రవి, యాలాల రాము యాదవ్, భాను ప్రకాష్, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page