ధాన్యం కొనుగోలు, రవాణా, దిగుమతి వేగవంతం చేయాలి : కలెక్టర్ ఎస్ వెంకట్రావు.

Spread the love

ధాన్యం కొనుగోలు, రవాణా, దిగుమతి వేగవంతం చేయాలని సోమవారం వెబ్ ఎక్స్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల స్పెషలాఫీసర్లు, తాసిల్దార్లు, ఎంపీడీవోలు ,పౌరసరఫరాల అధికారులతో అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సిహెచ్ ప్రియాంక, ఆదనపు కలెక్టర్ రెవెన్యూ బిఎస్ లతా తో కలిసి వెబ్ ఎక్స్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మండల ప్రత్యేక అధికారులు సమన్వయంతో పని చేయాలని ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఫోటోలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వొద్దని కొనుగోలు కేంద్రాలకు దగ్గరలో ఉండి కొనుగోలు రవాణా త్వరగా అయ్యేలా చూడాలని కలెక్టర్ తెలిపారు .సివిల్ సప్లై అధికారులు మిల్లుల వద్ద వచ్చిన ధాన్యాన్ని లారీల నుండి వేగంగా దిగుమతి అయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. రోడ్డు రవాణా అధికారులు లారీలను అవసరమైన చోటుకు వెంటనే చేర్చాలని వాటిని ధాన్యం కొనుగోలు వద్ద ధాన్యాన్ని మిల్లులకు రవాణా వెంటనే జరిగేలా మండల స్మశాల ఆఫీసర్లు ఎంపీడీవోలు చూడాలని కలెక్టర్ పేర్కొన్నారు.
కోదాడ హుజూర్నగర్ మిల్లుల వద్ద ధాన్యం లారీల నుండి దిగుమతి అయ్యేలా ఆర్డీవోలు ప్రత్యేక కమిటీలు పెట్టి పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలలోని ధాన్యాలను ఈ నెల చివరి 30వ తేదీ గల పూర్తిగా రవాణా అయ్యే విధంగా చూడాలని కలెక్టర్ తెలిపారు .దిగుమతులు వద్ద లేబర్ ను ఎక్కువగా పెట్టుకునే విధంగా సివిల్ సప్లై అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. నాగారం, తుంగతుర్తి ధాన్యం కొనుగోలు కేంద్రాలు సరిగా పర్యవేక్షించడం లేదని తన దృష్టికి రావడం జరిగిందని, త్వరగా ధాన్యం కొనుగోలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలియజేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాల వద్ద అన్ని వసతులు ఏర్పాటు చేయాలని, త్వరగా దాన్యం మిల్లులకు రవాణా అయ్యేలా, మిల్లుల వద్ద దిగుమతి త్వరగా చేసి ఇతర రాష్ట్రాల నుండి కేటాయించిన లారీలను వెంటనే పంపాలని కలెక్టర్ ఆదేశించారు.

Related Posts

You cannot copy content of this page