సీఎం కేసీఆర్‌ పర్యటనకు చురుగ్గా ఏర్పాట్లు:మంత్రి గంగుల కమలాకర్…

Spread the love

సీఎం కేసీఆర్‌ పర్యటనకు చురుగ్గా ఏర్పాట్లు:మంత్రి గంగుల కమలాకర్…

సీఎం కేసీఆర్‌ పెద్దపల్లి జిల్లా పర్యటన కోసం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నాయని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఈ నెల 29న ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనే బహిరంగ సభా స్థలిని శుక్రవారం మంత్రి పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 29న ముఖ్యమంత్రి కేసీఆర్‌ జిల్లా సమీకృత కలెక్టర్‌ కార్యాలయాల సముదాయం, టీఆర్‌ఎస్‌ జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారన్నారు. అనంతరం లక్ష మందితో నిర్వహించే బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారని మంత్రి తెలిపారు.

ముఖ్యమంత్రి సభ కోసం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధుకర్‌, ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి, సుంకె రవి శంకర్, రాకేష్, బాలమల్లు, గ్రంథాలయ చైర్మన్స్‌ రఘువీర్‌సింగ్‌, రవీందర్ రెడ్డి, హరి శంకర్, సూరి పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page