రైతులందరికీ రూ. లక్ష లోపు రుణాలు మాఫీ చేస్తామని సీఎం కేసీఆర్‌ 2014, 2018 ఎన్నికల్లో హామీనిచ్చి ఓట్లు

Spread the love

సాక్షిత హైదరాబాద్‌: రైతులందరికీ రూ. లక్ష లోపు రుణాలు మాఫీ చేస్తామని సీఎం కేసీఆర్‌ 2014, 2018 ఎన్నికల్లో హామీనిచ్చి ఓట్లు వేయించుకున్నారని, అధికారంలోకి వచ్చాక ఆ హామీ ఉత్తమాటగానే మిగిలిపోయిందా అని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్‌ షర్మిల ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలనే లక్షణం సీఎం కేసీఆర్‌కి లేదన్నది స్పష్టమవుతోందన్నారు.

రైతులకు విడతల వారీగా రూ.90 వేలలోపు రుణమాఫీ చేస్తామని చెప్పి కేవలం రూ.37 వేల లోపు రుణాలు ఉన్న వారికే రుణమాఫీ చేసి చేతులు దులుపుకున్నారని గుర్తు చేశారు. 5.66 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ జరిగిందని మండిపడ్డారు. కేసీఆర్‌ చేసిన ద్రోహంతో రాష్ట్రవ్యా ప్తంగా దాదాపు 31లక్షల మంది రైతులు బ్యాంకర్ల వద్ద తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నా రు. కేసీఆర్‌ ఇచ్చిన హామీని వెంటనే నిలబె ట్టుకోవాలని డిమాండ్‌ చేశారు.

Related Posts

You cannot copy content of this page