CM KCR make the meeting successful
దేశ రాజకీయాలకు ఒక కొత్త దశదిశ ఇవ్వబోతున్న సభ ఖమ్మంలో జరగనున్న బిఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ.
సీఎం కేసీఆర్ సభను విజయవంతం చేయండి
ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
సాక్షిత : ఖమ్మంలో సీఎం కేసీఆర్ KCR పాల్గొనే బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలో కోదాడ నియోజకవర్గం నుంచి 40 వేల మందికి పైగా తరలి రావాలని కోదాడ అభివృద్ధి ప్రధాత, శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ పిలుపునిచ్చారు. చిలుకూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిధులుగా పాల్గొని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు .
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ….బహిరంగ సభ విజయవంతం చేయడంలో ప్రతి ఒక్క కార్యకర్తను భాగస్వామి చేయాలన్నారు. దేశ రాజకీయాలను ప్రభావితం చేసే విధంగా భారత రాష్ట్ర సమితి పనిచేస్తుందని వారన్నారు. దేశంలో బిజెపి నిరంకుశ పాలనను ఎదుర్కోవడం ఒక భారత రాష్ట్ర సమితి, సీఎం కేసీఆర్ తో సాధ్యమని వారన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అమలు కావాలంటే భారత రాష్ట్ర సమితి దేశంలో అధికారంలోకి రావడంమె లక్ష్యంగా పనిచేయాలని వారు అన్నారు. అనంతరం మండల కేంద్రంలో వివిధ పార్టీలకు చెందిన 50 కుటుంబాలు బి ఆర్ ఎస్ పార్టీలో చేరారు.
వారందరికీ ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ కోసం పని చేసిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పార్టీలో చేరిన వారు నూకపొంగు హనుమంతు,
కందుకూరి సైదులు, మల్లెపంగు కోటయ్య, స్వామి, సురేష్, గురునాథం, ఎస్కే ఇమామ్, సునీత, లక్ష్మి,, గౌతమి, పుల్లమ్మ, పుల్లయ్య, నరసయ్య, ఉపేందర్, పుష్పలత, నాగమ్మ, తదితరులు ఎమ్మెల్యే సమక్షంలో బిఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కొండా సైదయ్య, పార్టీ ప్రధాన కార్యదర్శి నలబోలు శ్రీనివాస్ రెడ్డి, సొసైటీ చైర్మన్ జనార్ధన్,
రైతు సమన్వయ సమితి అధ్యక్షులు దొడ్డ సురేష్, మాజీ ఎంపీపీ బజ్జురి వెంకట్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి బట్టు శివాజీ నాయక్, ఎంపీటీసీ రమణ నాగయ్య, మాజీ సర్పంచి కడియాల వెంకటయ్య, నాయకులు కస్తూరి నరసయ్య, మండల యువత అధ్యక్షులు గన్నా అశోక్, రాంబాబు, శోభన్,పాషా, అన్నపూర్ణ, పార్టీ ముఖ్య నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.