ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు
జిల్లాలో మొదటి రోజు పరీక్షకు 22,853 మంది విద్యార్థులు హాజరు
10వ తరగతి పరీక్షా కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్
ఏలూరు,ఏప్రిల్,3ః ప్రశాంత వాతావరణంలో జిల్లాలో 10 వ తరగతి పరీక్షలు జరుగు తున్నాయని జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ అన్నారు .
స్థానిక అశోక్ నగర్ లోని కె. బి.డి. టి ఉన్నత పాఠశాలలో జరుగుతున్న 10వ తరగతి పరీక్షా కేంద్రాన్ని సోమవారం ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు మొదటి రోజు జరిగిన ప్రధమ భాష తెలుగు పరీక్షకు 23227 మంది విద్యార్థులకు గాను 22853 మంది (98.39 శాతం)విద్యార్థులు హాజరు కాగా 374 మంది విద్యార్థులు గైర్హాజరైనారన్నారు .
ఈ రోజు పరీక్షలో ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు కాలేదన్నారు.
పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, తదితర సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇన్విజిలేటర్, చీఫ్ సూపరింటెండెంట్ లకు పలు సూచనలు జారీచేశారు.ప్రతి పరీక్ష కేంద్రం లో కనీసం మందులతోపాటు ఎఎన్ఎం ఏర్పాటు చేశామని , జిల్లాలో పదవతరగతి పరీక్షల్లో ఎటువంటి మాస్ కాపీయింగు తావు లేకుండా ప్రతి పరీక్ష కేంద్రం వద్ద సిట్టింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేశామని , సీనియర్ అధికారులతో కలిసి ఏర్పాటుచేసిన ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులు పరీక్ష కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేస్తున్నారని కలెక్టర్ అన్నారు .
జిల్లా విద్యాశాఖాధికారి యన్.వి.రవిసాగర్ మాట్లాడుతూ ఈ రోజు ఫ్లయింగ్ స్క్వాడ్ 52 పరీక్షా కేంద్రములు , కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్ , ఏలూరు వారు 01 పరీక్షా కేంద్రము , జాయింట్ కలెక్టర్ , ఏలూరు వారు 01 పరీక్షా కేంద్రము , డిస్ట్రిక్ట్ లెవెల్ అబ్జర్వర్ 05 పరీక్షా కేంద్రములు , జిల్లా విద్యాశాఖాధికారి , ఏలూరు వారు 04 పరీక్షా కేంద్రములు , ప్రభుత్వ పరీక్షల సహాయ కమీషనర్ వారు 02 పరీక్షా కేంద్రములు మొత్తం 65 పరీక్షా కేంద్రములను తనిఖీ చేసియున్నారన్నారు.
జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ,ఏలూరు వారిచే విడుదల