చిన్నారి మనోజ్ఞకు మరో జన్మ ప్రసాదించిన

Spread the love

కూరపాటి చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌
డా.ప్రదీప్‌ కుమార్ ను ప్రత్యేకంగా అభినందించిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర

బాలుడి ఛాతీపైనుండి కారు వెళ్లడంతో మల్టీ ఆర్గాన్స్‌ డ్యామేజ్‌
తీవ్రంగా రక్తపు వాంతులు, ఇంటర్నల్‌ బ్లీడింగ్
హై రిస్క్‌ కావడంతో సర్జరీ మరింత ప్రమాదమన్న పీడియాట్రిక్‌ సర్జన్స్‌
అరుదైన ట్రీట్‌మెంట్‌ అందించిన డా.ప్రదీప్‌, డా.బ్రహ్మకుమార్‌

సంపూర్ణ ఆరోగ్యంగా కోలుకున్న చిన్నారి, శనివారం డిశ్చార్జీ
వైద్యులకు కృతజ్ఞతలు తెలిపిన చిన్నారి తల్లిదండ్రులు

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

మూడేండ్ల బాలుని కారు ఢీకొని ఛాతీపై నుండి కారు వెళ్లడంతో తీవ్రంగా గాయపడి, ప్లీహం, క్లోమం, మెదడు, ఊపిరితిత్తులు తదితర మల్టీ ఆర్గాన్స్‌ డ్యామేజీ అయిన చిన్నారికి కాపాడిన ఖమ్మంలోని కూరపాటి చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌ వైద్యులు డా.కూరపాటి ప్రదీప్‌కుమార్‌ను పలువురు అభినందిస్తున్నారు. వివిధ ఆర్గాన్స్‌ డ్యామేజీ కావడంతో ఆపరేషన్‌ చేసే అవకాశం లేన పరిస్థితుల్లో కేవలం మందులతోనే బాలుని కోలుకునేలా చేసి బాలుని తల్లిదండ్రులతో క్షేమంగా ఇంటికి చేర్చడంతో ఆ తల్లిదండ్రుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి…
సత్తుపల్లిలోని గాంధీనగర్‌ లో మార్చి నెల 24 మధ్యాహ్నం 12గంటల సమయంలో ఆరు బయట ఆడుకుంటున్న మూడేండ్ల చిన్నారి మనోజ్ఞను కారు ఢీకొని చాతీపై నుండి కారు వెళ్లడంతో తల, మెదడు, ప్లీహం, క్లోమం, ఊపిరితిత్తులు తదితర ఆర్గాన్స్‌కు బలమైన గాయాలు అయ్యాయి… తీవ్రంగా రక్తపు వాంతులు, ఇంటర్నల్‌ బ్లీడింగ్ కావడంతో బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. శరీర భాగాలకు బాగా దెబ్బలు తగలడంతో పరిస్థితి సీరియస్‌గా మారింది. బాలుడి తల్లిదండ్రులు దీప్తి, అప్పారావు వెంటనే స్థానికంగా సత్తుపల్లిలోని చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో బాలుని తీసుకుని ఖమ్మంలోని కూరపాటి చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌కు తీసుకొచ్చారు. అక్కడ డా. కూరపాటి ప్రదీప్‌కుమార్‌ బాలుని పరిశీలించి కడుపు ఉబ్బరంగా ఉబ్బిపోయి, లోపల బ్లీడింగ్ అవుతున్న పరిస్థితిని బట్టి చిన్నారికి సీటీ స్కాన్‌, అల్ట్రా స్కాన్‌ చేయించారు. అయినా ఇంటర్నల్‌ బ్లీడింగ్ తగ్గకపోవడంతో సీటీ ఆబ్డామిన్‌ స్కాన్‌ చెయ్యడంతో బాలుని క్లోమం, ప్లీహం, ఊపిరితిత్తులు, తదితర భాగాలకు దెబ్బలు తగిలి, ఆయా భాగాల్లో బ్లీడింగ్ అవుతున్నట్టు స్కాన్‌ ద్వారా నిర్దారించారు. ప్రధానంగా ప్లీహం, క్లోమం కట్‌ అవడంతో బ్లీడింగ్ అవుతోంది. ఈ పరిస్థితుల్లో డా.కూరపాటి ప్రదీప్‌ కుమార్‌ ప్రముఖ చిల్డ్రన్స్‌ సర్జన్లతో మాట్లాడంతో సర్జరీ చేస్తే చిన్నారి ప్రాణాలకు ముప్పని సాధ్యమైనంత మేరకు మెడిసిన్‌తోనే వైద్యం అందించాల్సి ఉందని సలహా ఇచ్చారు. ఆ ప్రమాదంలోనే చిన్నారి తలకు బలమైన గాయం కూడా కావడంతో మెదడు భాగానికి కూడా దెబ్బ తగిలి సీఎస్ఎఫ్‌ రైనోరియా వల్ల ముక్కునుండి నీరు కారుతుండటంతో న్యూరో సర్జన్లతో మాట్లాడి డా.ప్రదీప్‌కుమార్‌, డా.బ్రహ్మకుమార్‌ ఇరువురూ బాలుని తల్లిదండ్రులు దీప్తి, అప్పారావు అనుమతితో కూరపాటి చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్‌ ప్రారంభించారు. చిన్నారిని కంటికి రెప్పలా కాపాడుతూ, ప్రతీ క్షణం అబ్జర్వేషన్‌లో ఉంచి, ప్రత్యేక శ్రద్ధతో పీడియాట్రిక్‌ వైద్య నిపుణులు డా. కూరపాటి ప్రదీప్‌, డా. బ్రహ్మకుమార్‌ అరుదైన వైద్యం అందించారు. రక్తం తక్కువగా ఉండటంతో అవసరమైన మేరకు రక్తం ఎక్కిస్తూ బాలునికి వైద్యం కొనసాగించారు. ఫలితంగా మూడు రోజుల్లోనే ఇంటర్నల్‌ బ్లీడింగ్ నిలిచిపోవడంతో పాటు ఆర్గాన్స్‌ అన్నీ మళ్లీ మునుపటి మాదిరిగానే పనిచెయ్యడం ప్రారంభించాయి. దీంతో వేగంగా కోలుకున్న చిన్నారిని శనివారం డిశ్చార్జీ చేశారు. బాలుని తల్లిదండ్రుల మోములో ఆనందం వెల్లివిరిసింది. సీరియస్‌ ఇంజూరీ అయిన బాలుడికి అరుదైన వైద్యం అందించి కాపాడిన కూరపాటి చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌ వైద్యులు, ప్రముఖ పిల్లల వైద్యనిపుణులు డా.ప్రదీప్‌కుమార్‌ను సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యతో పాటు పలువురు ప్రముఖులు, వైద్యనిపుణులు అభినందించారు.

బాలుడు కోలుకోవడం సంతృప్తి నిచ్చింది
డా.ప్రదీప్ కుమార్ కూరపాటి, పిల్లల వైద్యనిపుణులు

చిన్నారి మనోజ్ఞ ను కారు ఢీ కొనడంతోపాటు ఛాతీపై నుండి కారు వెళ్లడంతో పలు కీలక ఆర్గాన్స్ కు బలమైన గాయాలు అయ్యాయి. అపస్మారక స్థితిలో మా హాస్పిటల్ కు తీసుకువచ్చారు. పలు రకాల స్కాన్ లు చేసి లోపల ఏ ఏ అర్గాన్స్ దెబ్బతిన్నది గుర్తించి, సర్జరీ చెయ్యలేని పరిస్థితుల్లో బాలుని పేరెంట్స్ అనుమతితో కేవలం మెడిసిన్ తో ట్రీట్‌మెంట్ అందించాం. బాలుడు సకాలంలో కోలుకుని సాధారణ స్థితికి వచ్చాడు. హై రిస్క్ చేసి చిన్నారిని కాపాడటం ఆనందాన్నిచ్చింది.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page