ముఖ్యమంత్రి కేసీఆర్‌ ది గొప్ప మనస్సు..కార్మికుల పక్షపాతి ఆర్టీసీ ఉద్యోగులకు పెద్ద కానుక..

Spread the love

సాక్షిత : ఎవరు ఊహించని విధంగా ఉద్యోగుల చిరకాల వాంఛ తీర్చిన కేసీఆర్‌కు ఆర్టీసీ ఉద్యోగుల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు..

43వేల 373 మంది కుటుంబాల్లో వెలుగులు నింపిన సీఎం కేసీఆర్‌ కి రుణపడి ఉంటాం..
బాణా సంచా కాల్చి, సీట్లు పంచి ,ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలభిషేకం చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాబినెట్ సమావేశంలో టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ, 43 వేల 373 మంది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు చేస్తూ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్న శుభసందర్భంగా మంత్రి ,బీఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మెరకు మియాపూర్ డివిజన్ పరిధిలోని మియాపూర్ బస్ డిపో- 1, బస్ డిపో – 2 లో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ గారు, మరియు ఆర్టీసీ ఉద్యోగుల సమక్షంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలభిషేకం చేసి,స్వీట్లు పంచి ,బాణాసంచా కాల్చి , హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మిక పక్షపాతి అని , అసాధ్యాలు, సుసాధ్యాలు చేసే ఘనత కేసీఆర్ కే దక్కుతుంది అని,ఎవరు కలలో కూడా ఊహించని విధంగా చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటారు అని, సీఎం కేసీఆర్‌ది ఎంతో గొప్ప మనస్సని, ఎప్పట్నుంచి బాధల్లో, కష్టాల్లో ఉన్న ఆర్టీసీ ఉద్యోగులకు ఆయన గొప్ప వరం అందించి వారి కష్టాలన్నీ ఏకకాలంలో పోగొట్టారని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు. గత కొంతకాలంలో ఆర్టీసీ కార్మికులు ఎంతో మనోవేదనకు గురవుతున్నారన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన వీరికి స్వరాష్ట్రంలో సముచిత స్థానం దక్కలేదని, ఏపీ రాష్ట్రంలో అక్కడ ఉద్యోగులు ఎంతో సంతోషంగా ఉన్నారనే భావన వారిలో ఉండేదని గుర్తు చేశారు.

కేసీఆర్‌ ఏకంగా కార్పొరేషన్‌ను ప్రభుత్వంలో విలీనం చేయడంతో అందరి కోరిక నెరవేరిందని, ఇది ఎంతో పెద్ద మనస్సుతో ఆర్టీసీ ఉద్యోగులకు కేసీఆర్‌ ఇచ్చిన గొప్ప వరమని ఆయన అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 43వేల మంది కుటుంబాల్లో ఆయన వెలుగులు నింపారని, మేమంతా ఎప్పటికీ ఆయన చేసిన మేలును మరిచిపోమని, రుణపడి ఉంటామని ప్రభుత్వ విప్ గాంధీ ఆర్టీసీ ఉద్యోగుల పక్షాన ముఖ్యమంత్రి కేసీఆర్‌ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఓ వైపు కార్పొరేషన్లను అమ్ముకుంటూ ఉద్యోగులను నడిబజార్లో పడేస్తుంటే..

కేసీఆర్‌ మాత్రం ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నారనడానికి ఇదే తాజా నిదర్శనమని, కార్పొరేషన్‌ను ప్రభుత్వంలో చేర్చుకోవడం చిన్న విషయమేమీ కాదని, ఈ నిర్ణయం దేశానికే ఆదర్శమన్నారు. ఇప్పుడు సీఎం కేసీఆర్ నిర్ణయంతో ఇక ఉద్యోగుల కష్టాలకు శాశ్వత పరిష్కారం దొరికిందని అన్నారు. ఈనిర్ణయాన్ని యావత్ రాష్ట్ర, దేశ ప్రజలు కూడా హర్షిస్తున్నారని అన్నారు. ఈ అసెంబ్లీ సెషన్లోనే ఈ బిల్లు పాస్‌ చేసి ఉద్యోగుల చిరకాల వాంఛ నెరవేర్చుతామని, వారి ఉద్యమ స్పూర్తికి కానుకగా దీన్ని అందిస్తామని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు.

ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులు మాట్లాడుతూ కలలో కూడా ఊహించని విధంగా ఆర్టీసీ ని ప్రభుత్వంలో విలీనం చేస్తూ తీసుకున్న నిర్ణయం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ కి జీవితాంతం ఋణాపడి ఉంటామని, మా జీవితాలలో వెలుగు నింపిన వారు అని, ముఖ్యమంత్రి కేసీఆర్ కి,మంత్రి కేటీఆర్ కి , ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ కు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియచేస్తున్నాం అని హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, బీఆర్ ఎస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు,వార్డ్ మెంబర్లు,ఏరియా కమిటీ ప్రతినిధులు,ఉద్యమకారులు, పాత్రికేయ మిత్రులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగినది.

Related Posts

You cannot copy content of this page