సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ సద్వినియోగంపై క్షేత్రస్ధాయిలో దృష్టి సారించాలి

Spread the love

నకిలీ విత్తనాలు, ఎరువులతో ఎవరైనా రైతులను మోసం చేస్తే ఉపేక్షించేది లేదు…
బెస్ట్ పోలీస్ స్టేషన్ల పనితీరు ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలి.
కానిస్టేబుల్ తుది పరీక్షలకు పకడ్బంది బందోబస్తు..
నేరాల నియంత్రణకు ముమ్మరంగా పోలీస్ పెట్రోలింగ్..
సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా వుండాలి
నేరసమీక్ష సమావేశం వెల్లడించిన పోలీస్ కమిషనర్..


: సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్

పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌లను ట్రాక్ చేయడంలో సహాయపడే సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సి ఏ ఇ ఆర్) పోర్టల్ సేవలపై విస్తృత ప్రచారం చేయాలని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ తెలిపారు.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన నేరసమీక్ష సమావేశంలో పాల్గొన్న పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ఇటీవల లాంఛనంగా ప్రారంభమైన (సిఇఐఆర్) సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని సూచించారు. భవిష్యత్తులో మరిన్ని అధునిక టెక్నాలజీ అందుబాటులోకి వస్తాయని అన్నారు. నకిలీ విత్తనాలు, ఎరువులతో ఎవరైనా రైతులను మోసం చేస్తే ఉపేక్షించేది లేదని అన్నారు.
విత్తనాలు,ఎరువులు,పురుగు మందుల విక్రయాల్లో అక్రమాలను అడ్డుకోవడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని ఆదేశించారు.
వ్యవసాయ సీజన్ ప్రారంభం కావడంతో అన్నదాతలకు అండగా వుంటూ….నకిలీ దందాల కట్టడికి పోలీస్ వ్యవసాయ శాఖ సంయుక్త దాడులు నిర్వహించాలన్నారు.
అక్రమ్ర రవాణా మార్గాలపై దృష్టి పెట్టి నకిలీ, అధిక ధరలకు అంటగడుతున్న వారిపై నిఘా ముమ్మరం.. చేయాలని పోలీస్ అధికారుల సమావేశం దిశనిర్ధశం చేశారు.


తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి మరియు జే న్ టీ యూ హెచ్ ఆద్వర్యంలో ఈనెల 30వ తేదీన 21 పరీక్ష కేంద్రాలలో నిర్వహించనున్న కానిస్టేబుల్ అభ్యర్థుల తుది రాత పరీక్షలకు ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు తలెత్తకుండా పోలీసు యంత్రాంగం పకడ్బందిగా బందోబస్తు, భద్రత ఏర్పాట్లు చేపట్టి విజయవంతం చేయాలని పోలీస్ అధికారులకు ఆదేశించారు.
దేశంలో అత్యుత్తమమైన పోలీస్ స్టేషన్ల జాబితాలో స్దానం పొందిన మధిర రూరల్ ,వియం బంజారా పోలీస్ స్టేషన్ల పనితీరు ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలని అన్నారు. నేరాల నియంత్రణకు విజబుల్ పోలీసింగ్ తో పాటు నిరంతరం తనిఖీలు నిర్వహించాలని, అసాంఘిక కార్యకలాపాలపై, నేరస్తుల కదలికపై నిఘా ఉండాలన్నారు. జిల్లాలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం వాటిల్లకుండా, అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా అక్రమ రవాణా నిరోధించే ఉద్దేశంతో ప్రతి చోట క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. సైబర్ నేరాలు, లోన్‌యాప్‌ మోసాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీస్ కమిషనర్ సూచించారు. చాలా యాప్‌లు ఫోన్‌ ద్వారా రుణాలను అందిస్తాయి, అవసరమైన వ్యక్తులు వారి పరిచయాలను యాక్సెస్‌ చేయడానికి అనుమతిస్తారు. సులభమైన వాయిదాలు, వడ్డీలని నమ్మించినప్పటికీ అధిక వడ్డీ రేటును వసూలు చేస్తారు, ఎవరైనా తిరిగి చెల్లించడంలో విఫలమైనా, ఆలస్యం చేసినా సదరు కంపనీ ప్రతినిధులు రుణదాతకు సంబంధించిన కాంటాక్ట్‌లందరినీ సంప్రదించడం, మెసేజ్‌ చేయడం ద్వారా వేధించడం ప్రారంభిస్తారని,ఈ క్రమంలోనే లోన్‌యాప్స్‌ నుంచి రుణాలు తీసుకున్న వారిని వేధింపులకు గురిచేయడంతో పాటు భయపెడుతూ అధికంగా వడ్డీ వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వస్తాయని, ఇలాంటి వాటిపట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Related Posts

You cannot copy content of this page