ఏపీ ప్రభుత్వం దివాళ తీయడంతోనే పింఛన్ల రద్దు

Spread the love

Cancellation of pensions due to bankruptcy of AP Govt

ఏపీ ప్రభుత్వం దివాళ తీయడంతోనే పింఛన్ల రద్దు

పింఛన్లే కాదు…అమ్మఒడి, చేదోడు, విద్యాదీవెనలు తదితర పథకాలు కూడా రద్దవుతాయి

వేలాది మంది పేదల నోట్లో మట్టికొడుతూ వైసీపీ నేతలు సొంత దందాల్లో మునిగితేలుతున్నారు

పేదలకు అండగా తెలుగుదేశం పార్టీ..సచివాలయం స్థాయి నుంచి కలెక్టరేట్ వరకు అధికారులను నిలదీస్తాం

నెల్లూరులోని కలెక్టర్ బంగ్లా వద్ద మీడియాతో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

జిల్లాలో వేలాది పింఛన్ల రద్దును ఉపసంహరించుకోవాలని కోరుతూ కలెక్టర్ చక్రధర్ బాబును కలిసిన సోమిరెడ్డి, బీద రవిచంద్ర, అబ్దుల్ అజీజ్, పరసా వెంకటరత్నం, పోలంరెడ్డి దినేష్ రెడ్డి, పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి, చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి, బొమ్మి సురేంద్ర తదితరులు

పింఛన్లతో పాటు ఇరిగేషన్ శాఖలో కుంభకోణాలు, సీజేఎఫ్ఎస్ భూముల సమస్య, విత్తనాల పంపిణీ, ఎరువుల బ్లాక్ మార్కెటింగ్ తదితర అంశాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన టీడీపీ నేతలు

సోమిరెడ్డి కామెంట్స్

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 20 వేలకు పైగా పింఛన్లు రద్దు చేస్తున్నట్లు లబ్ధిదారులకు నోటీసులు ఇచ్చారు..

పేదోళ్లకు మూడెకరాల మాగాణి ఉందని, పదెకరాల మెట్ట ఉందని, 300 యూనిట్లకు పైగా కరెంట్ వాడారని పింఛన్లకు ఎసరుపెట్టారు

నోటీసులు అందుకున్న వారికి కూడా జనవరి 1న పింఛన్లు అందిస్తామని డీఆర్డీఏ పీడీ చెబుతున్నారు

కానీ కలెక్టర్ మాత్రం రెండు రోజుల్లో విచారణ పూర్తి చేసి నోటీసుల్లోని సమాచారం కరెక్ట్ అయితే పింఛన్లు
ఆపేస్తామంటున్నారు

20 వేల మందికి సంబంధించి రెండు రోజుల్లో సక్రమమైన విచారణ జరుగుతుందని మాకు నమ్మకం లేదు

ఈ రోజు పింఛన్లే పోతున్నాయి…రేపు వారికి అమ్మఒడి, వాహనమిత్ర, చేదోడు, విద్యాదీవెన వంటి పథకాలను కూడా ఆపేయబోతున్నారు

రాష్ట్ర ప్రభుత్వం దివాళా తీయడంతోనే ఇలాంటి కుట్రలకు పాల్పడి పేదలకు పథకాలు నిలిపేయబోతున్నారు

పేదలకు అండగా తెలుగుదేశం పార్టీ నిలబడుతుంది..పింఛన్లు కానీ రద్దయితే సచివాలయం స్థాయి నుంచి కలెక్టరేట్ వరకు అందరినీ నిలదీస్తాం

పేదల నోట్లో మట్టికొట్టే ఈ ప్రయత్నాలు ప్రభుత్వానికి తగవు

వేలాది మంది పేదలు నష్టపోతుంటే జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు…సొంత వ్యాపారాల్లో మునిగితేలుతున్నారా

వైసీపీ ప్రజాప్రతినిధులకు రియల్ ఎస్టేట్లు, లేఅవుట్లు, గ్రావెల్, ఇసుక, టోల్ గేట్లు, తిప్పలు, కొండలు తప్ప ప్రజల కష్టాలు కనిపించడం లేదు

మూడున్నరేళ్ల వైసీపీ పాలనలో జిల్లాలో ఇరిగేషన్ శాఖ భారీ కుంభకోణాలకు నిలయంగా మారింది

ఒక పనికే రకరకాల కేటగిరిల్లో బిల్లులు పెట్టుకుని కోట్లకు కోట్లు ప్రజల సొత్తు కాజేశారు

కలెక్టర్ స్పందించి విచారణ జరిపి చర్యలు తీసుకుంటే సరి…లేదంటే న్యాయ పోరాటం తప్పదు

టీడీపీ ప్రభుత్వ హయాంలో 65 వేల ఎకరాల సీజేఎఫ్ఎస్ భూములకు సంబంధించి డీకేటీ పట్టాలు పంపిణీ చేశాం

అప్పట్లో మిగిలిపోయిన వాటిని ఇంకా పరిష్కరించకపోవడం బాధాకరం

సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి అసైన్మెంట్ కమిటీ ఆమోదించిన పట్టాల పంపిణీని అడ్డుకున్నారు..ఆ సమస్యను పరిష్కరించాలని కోరాం

భారీ వర్షాలకు నష్టపోయిన రైతులకు విత్తనాల పంపిణీ అస్తవ్యస్తంగా జరుగుతోంది

యూరియా బ్లాక్ మార్కెట్ లోకి వెళ్లిపోతుంటే వ్యవసాయ శాఖ మంత్రి ఏం చేస్తున్నారో

ఆర్బీకేలకు వచ్చిన విత్తనాలు, యూరియాలను వైసీపీ నేతల ఇళ్లలో దించుకుని వారే పంచుకుంటున్నారు

ప్రజా సమస్యల విషయంలో తెలుగుదేశం పార్టీ రాజీ పడే ప్రసక్తే లేదు…ఇక నిరంతరం పోరాటాలే

Related Posts

You cannot copy content of this page