ఖమ్మం జిల్లా కేంద్రంలో బండి సంజయ్ దిష్టి బొమ్మను దహనం చేసిన బీఆర్ఎస్ శ్రేణులు..

Spread the love

పేపర్స్ లీకేజీల వ్యవహారంలో బీజేపీ అసలు రంగు బయట పడింది.

పదవ తరగతి ప్రశ్నపత్రం లీకేజీ నిందితుడితో బండి సంజయ్ సహా బీజేపీ నేతలతో ప్రత్యక్ష సంబంధాలు.

కేంద్ర ప్రభుత్వం డైరెక్షన్ లో ఇదంతా జరుగుతున్నాయి.

తెలంగాణపై కేంద్రం కక్ష్య గట్టింది.

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణలో అలజడి సృష్టించాలని చూస్తోంది.

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

తెలంగాణ రాష్ట్రంపై కక్ష్య గట్టిన కేంద్రం ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వన్ని బదనాం చేయాలని చూస్తోందని దాన్ని సాగనివ్వమని ఖమ్మం మేయర్ పునుకొల్లు నీరజ ధ్వజమెత్తారు.
ప్రశ్నాపత్రల లీకేజీల పై రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశాల మేరకు ఖమ్మం నగర బి అర్ ఏస్ పార్టీ అధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టి ఇల్లందు సర్కిల్ నందు శ్రేణులు పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతూ బండి సంజయ్ దిష్టి బొమ్మను దహనం చేశారు.


ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ కూడా తెలంగాణలో ఈ విధంగా పేపర్ లీకేజీలు ఘటనలు జరగలేదని, ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో తెలంగాణలో ఏదో ఒక అలజడి సృష్టించి, రాజకీయ లబ్ధి పొందాలని బిజెపి చూస్తుంది బిజెపి చూస్తుందని ద్వజమెత్తారు.
కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర బీజేపీ నేతలు తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని, ప్రశ్నాపత్రాల లికేజి అంశంపై ఆ పార్టీ సానుభూతిపరుల కుట్ర కోణంపై నిష్పక్షపాత దర్యాఫ్తు కొనసాగుతోందని, దోషులు ఎంతటి వారైనా ప్రభుత్వం వదిలే ప్రసక్తే లేదని అన్నారు. మొన్నటి వరకు కులాలు, మతాలు మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకున్న బిజెపి నేడు ప్రశ్నా పత్రాల లీకులు చేస్తూ బి అర్ ఏస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయలని చూస్తుంది అని అన్నారు.

మేయర్ నీరజ , సుడా చైర్మన్ బచ్చు విజయకుమార్, బి అర్ ఏస్ పార్టీ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, కార్పొరేటర్లు కర్నాటి కృష్ణ, బుడిగం శ్రీనివాస్, రాపర్తి శరత్, కూరాకుల వల్లరాజు, కన్నం ప్రసన్న, దండా జ్యోతి రెడ్డి, మోతారపు శ్రావణిసుధాకర్, మడూరి ప్రసాద్, చిరుమామిళ్ల నాగేశ్వరరావు, దాదే అమృతమ్మ, మందడపు లక్ష్మి, బిసి సెల్ ప్రెసిడెంట్ మేకల సుగుణ రావు, ఎస్టీ సెల్ ప్రెసిడెంట్ వాంకుడోత్ సురేష్ , కిషన్ నాయక్, మహిళా అధ్యక్షురాలు తన్నీరు శోభారాణి, ఎస్సి సెల్ ప్రెసిడెంట్ తోగరు భాస్కర్, షకీన, తొట్టి కొమరయ్య, అబ్బాస్, తమ్మిశెట్టి పరుశురాం, కెసిఆర్ టవర్స్ రహీం, శివ, ఆరంపుల చిన్నం మల్లేశం, మోతే కుమార్, వీరభద్రం, నెమలి కిషోర్, వీరేందర్ గౌడ్, బోజెడ్ల రామ్మోహన్, బాలిని శ్రీనివాస్, చిలకల వెంకటనరసయ్య, మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page