ఎంపీ నామా నాగేశ్వరరావుకు కృతజ్ఞతలు తెలిపిన బి ఆర్ ఎస్ పార్టీ మండల ఎస్సీ విభాగం అధ్యక్షులు

Spread the love

BRS Party mandal SC unit presidents thanked MP Nama Nageswara Rao

ఎంపీ నామా నాగేశ్వరరావుకు కృతజ్ఞతలు తెలిపిన బి ఆర్ ఎస్ పార్టీ మండల ఎస్సీ విభాగం అధ్యక్షులు వేల్పుల మురళి
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

నూతన పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలి అని ప్రస్తావించిన ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావుకు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా బి ఆర్ ఎస్ పార్టీ మండల ఎస్సీ విభాగం అధ్యక్షులు వేల్పుల మురళి కృతజ్ఞతలు తెలుపుతూ పార్లమెంటు సభలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చే విధంగా అంబేద్కర్ పార్లమెంట్ భవనానికి పేరు పెట్టాలని

లోక్సభలో మాట్లాడటం ఎస్సీ వర్గీకరణ పై జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చే విధంగా మాట్లాడినందుకు నామా నాగేశ్వరరావు కి దళిత సోదరులంతా అండగా ఉంటామని వారన్నారు బి ఆర్ ఎస్ పార్టీ దేశవ్యాప్తంగా దళితులకు అండగా ఉండి గిరిజనులకు రిజర్వేషన్లు కల్పించాలని ఏకైక లక్ష్యంతో కేసీఆర్ నాయకత్వంలో మరో ముందడుగు వేయటం పట్ల దళిత సమాజం మొత్తం కెసిఆర్ కు నామ నాగేశ్వరరావుకు అండగా ఉంటామని విలేకరుల సమావేశంలో మాట్లాడారు

Related Posts

You cannot copy content of this page