స్పందించాల్సిన అవసనం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

Spread the love

రాజకీయ కక్షతో పంపిన మోడీ(ఈడీ)నోటీసులు

నిజామాబాద్ :సెప్టెంబర్ 14
తనకు మోడీ నోటీసు వచ్చిందని, అది రాజకీయ కక్షతో పంపించిన నోటీసు కాబట్టి దానిపై పెద్దగా స్పందించాల్సిన అవసనం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఈడీ నోటీసును తమ పార్టీ న్యాయ విభాగానికి ఇచ్చామని, ఆ విభాగం ఎలా చెబితే అలా ముందుకెళ్తామని తెలిపారు.గురువారం ఆమె నిజామాబాద్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

ఈడీ నోటీసులు అందాయని క‌విత తెలిపారు. నోటీసుల‌ను పార్టీ లీగ‌ల్ సెల్‌కు అంద‌జేశాం. వారి సూచ‌న‌ల మేర‌కు ముందుకు వెళ్తాం. రాజ‌కీయ కక్షతోనే నోటీసులు ఇచ్చిన‌ట్లు బ‌లంగా న‌మ్ముతున్నాం. తెలంగాణ‌లో రాబోయే ఎన్నిక‌ల వాతావ‌ర‌ణాన్ని దృష్టిలో పెట్టుకుని త‌న‌కు నోటీసులు ఇచ్చారు.

గ‌త ఏడాది కాలం నుంచి ఆ కేసులో ద‌ర్యాప్తు జరుగుతోంద‌ని, ఇంకెన్నాళ్లు ఆ విచార‌ణ ఉంటుందో త‌న‌కు తెలియ‌దు. 2జీ కేసులో కూడా ఇంత కాలం విచారణ జ‌ర‌గ‌లేద‌నుకుంటా. రాజ‌కీయ ఉద్దేశంతోనే కేసు సాగుతోంద‌ని, తెలంగాణ ప్ర‌జ‌లు దీన్ని సీరియ‌స్‌గా తీసుకోరు. పార్టీ లీగ‌ల్ బృందం ఇచ్చే స‌ల‌హాల మేర‌కు ముందుకు వెళ్తామ‌న్నారు.

తాము ఏ పార్టీతోనూ క‌ల‌వ‌లేద‌ని, కేవ‌లం తెలంగాణ ప్ర‌జ‌లు, భార‌త దేశ ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అయ్యామ‌న్నారు. దేశ ప్ర‌జ‌లు సీఎం కేసీఆర్‌ను కావాల‌నుకుంటున్నార‌ని, దీంతో ఆ రెండు పార్టీల‌కు ఆ భ‌యం ప‌ట్టుకున్న‌ట్లు ఆమె తెలిపారు.

మేం ఎవ‌రికీ బీ టీమ్ కాద‌న్నారు. అంతులేని టీవీ సీరియ‌ల్ త‌ర‌హాలో విచార‌ణ సాగుతున్న‌ద‌ని, అదేమీ పెద్ద విష‌యం కాద‌న్నారు. బీజేపీ ఎన్నిక‌ల స్టంట్‌లో భాగంగా ఇలాంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోంద‌ని ఆమె ఆరోపించారు. ప్ర‌జ‌లే ఆ పార్టీకి బుద్ధి చెబుతార‌ని క‌విత పేర్కొన్నారు…

Related Posts

You cannot copy content of this page