SAKSHITHA NEWS

BRS Lok Sabha leader Nama Nageswara Rao questioned the Center in writing

ఆయుస్మాన్ నిధుల్లోనూ వివక్షే

తెలంగాణాకు అరకొర కేటాయింపులా?

మిగతా రాష్ట్రాలకు భారీ కేటాయింపులు

2021 -22 లో తెలంగాణా కు కేవలం రూ.12.25 కోట్లే

ప్రపంచ బ్యాంకు అనుమతితో భారీ రుణ ఒప్పందాలు

కేంద్రాన్ని లిఖితపూర్వకంగా ప్రశ్నించిన బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత నామ నాగేశ్వరరావు

సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్ :

ప్రధానమంత్రి ఆయుస్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాన్టక్చర్ మిషన్ (పిఎం ఏబిహెచ్ఐఎం) పథకం కింద తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం కేటాయిస్తున్న నిధులు మరీ అరకొరగా ఉంటున్నాయని బీఆర్ఎన్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు.

ఎంపీ నామ ఈ విషయమై గురువారం కేంద్ర ప్రభుత్వాన్ని లిఖిత పూర్వకంగా ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర వైద్య అవసరాలు తగ్గట్టు కేంద్రం నుంచి నిధులు కేటాయింపులు ఉండడం లేదని పేర్కొన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలతో సమానంగా కేటాయింపులు లేకపోవడంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి సొంత నిధులు ఖర్చు చేస్తూ వైద్య రంగాన్ని దేశంలోనే మేటీగా చేశారని అన్నారు.

ఈ పధకం అవసరాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్ అనుమతితో ఏడిబి వంటి ఆర్థిక సంస్థల నుంచి పెద్ద ఎత్తున రుణాలను తీసుకుంటూ తెలంగాణ పట్ల తీవ్ర వివక్షత చూపిస్తున్నారని నామ ధ్వజమెత్తారు. డిసెంబర్ 13,2022 నాటికి ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్(ఏడిబి)తో రూ. 300 మిలియన్లకు, జపాన్ ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ ఏజెన్సీ తో 50 బిలియన్లు. ప్రపంచ బ్యాంక్ నుంచి యుఎస్ డి 1 బిలియన్ కు రుణ ఒప్పందాలు చేసుకున్న కేంద్రం తెలంగాణా రాష్ట్రానికి ఆయుస్మాన్ పథకం కింద నిధులు ఇచ్చే విషయంలో వివక్షతను చూపిస్తుందని అన్నారు.

2021 – 22 ఆర్ధిక సంవత్సరంలో దేశ వ్యాప్తంగా రూ.584.04 కోట్ల నిధులు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మాత్రం కేవలం రూ.11.25 కోట్లు మాత్రమే నిధులు కేటాయించి, చేతులు దులుపుకుందని విమర్శించారు. అలాగే 2022- 23 ఆర్థిక సంవత్సరంలో పథకానికి రూ.4176.84 కోట్లు కేటాయించిన కేంద్రం తెలంగాణకు మాత్రం కేవలం రూ. 102.91 కోట్లు మాత్రమే నిధులు ఇచ్చి, వివక్షత చూపించిందన్నారు.

మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఈ కేటాయింపులు మరింత స్వల్పంగా, దారుణంగా ఉన్నాయని నామ అన్నారు. గుజరాత్ రాష్ట్రానికి 2022-23 ఆర్ధిక సంవత్సరంలో 118.30 కోట్లు, జార్ఖండ్ కు రూ. 240.16 కోట్లు, మహారాష్ట్రకు రూ.130.79 కోట్లు, ఉత్తరప్రదేశ్ కు రూ. 650.23 కోట్లు కేటాయించారని అన్నారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ సమాధానం ఇస్తూ ప్రధాన మంత్రి ఆయుస్మాన్ భారత్ ఇన్ఫ్రాన్టక్చర్ మిషన్ పథకాన్ని అక్టోబర్ 25,2021న ప్రారంభించామని, దేశ వ్యాప్తంగా ప్రజా ఆరోగ్య సంరక్షణ, మౌళిక నదుపాయాలను బలోపేతం చేసేందుకు ఈ పథకానికి రూ. 64,180 కోట్లు కేటాయించినట్లు చెప్పారు


SAKSHITHA NEWS