డిసెంబర్ 10 న జిల్లా పోలీసు శిక్షణా కేంద్రంలో ద్విచక్రవాహనాలు, త్రీ వీలర్ వాహనాల వేలం

Spread the love


Auction of two-wheelers and three-wheelers at the District Police Training Center on December 10

కర్నూలు జిల్లా…

280 వాహనాల వేలం .

డిసెంబర్ 10 న జిల్లా పోలీసు శిక్షణా కేంద్రంలో – ద్విచక్రవాహనాలు, త్రీ వీలర్ వాహనాల వేలం…
సాక్షిత : డిసెంబర్ 11 న కర్నూలు తాలుకా పోలీసుస్టేషన్ లో – ఫోర్ వీలర్ వాహానాల వేలం…

క్రైమ్, ఎక్సైజ్ కేసుల్లో చిక్కుకున్న వాహనాలు , అక్రమంగా మద్యం, సారా, గంజాయి తరలిస్తూ పట్టుబడిన వాహనాలను కర్నూలు సెబ్ , కర్నూలు సబ్ డివిజన్ పోలీసులు జప్తు చేసిన మొత్తం 280 వాహనాలను డిసెంబర్ 10, 11 వ తేదిలలో వాహనాల వేలం నిర్వహించబడుతుందని కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్ గారు శుక్రవారం తెలిపారు.

ఈ వాహనాల వేలం 2 ప్రాంతాలలో ఉంటుందన్నారు.

1) కర్నూలు జిల్లా పోలీసు శిక్షణా కేంద్రం, (DTC) దిన్నెదేవరపాడు గ్రామం, జగన్నాథగట్టు దగ్గర కర్నూలు.

2) కర్నూలు తాలుకా పోలీసుస్టేషన్ (బి.తాండ్రపాడు ).

2 రోజుల పాటు ( శనివారం డిసెంబర్ 10, ఆదివారం డిసెంబర్ 11 ) వాహనాల వేలం నిర్వహించబడుతుందన్నారు.

ఉదయం 10 గంటలకు ఆయా పోలీస్ అధికారుల సమక్షంలో వాహానాల వేలం ప్రారంభమవుతుందని పాల్గొనదలచిన వారు తగు ధరావత్తు చెల్లించి వాహానాల వేలంలో పాల్గొనాలన్నారు.

ద్విచక్రవాహనాలు, త్రీ వీలర్ వాహనాల వేలం…

శనివారం డిసెంబర్ 10 వ తేది కర్నూలు , దిన్నెదేవరపాడు గ్రామం, జగన్నాథగట్టు దగ్గర ఉన్న కర్నూలు జిల్లా పోలీసు శిక్షణా కేంద్రం (DTC) లో ద్విచక్రవాహనాలను, త్రీ వీలర్ వాహానాలను వేలంలో ఉంచనున్నారు.

ఫోర్ వీలర్ వాహానాల వేలం…

ఆదివారం డిసెంబర్ 11 వ తేది కర్నూలు తాలుకా పోలీసుస్టేషన్ లో ఫోర్ వీలర్ వాహానాలను వేలంలో ఉంచనున్నారు.

పోలీసు స్టేషన్ల వారీగా వాహనాల వివరాలు…

ఇందులో …

సి. బెళగల్ పియస్ పరిధిలో 31 వాహానాలు ( 31 టూ వీలర్స్ )

గూడూరు పియస్ పరిధిలో 34 వాహానాలు ( 30 టూ వీలర్స్ , 2 ఫోర్ వీలర్, 2 త్రీ వీలర్)

నాగాలాపురం పియస్ పరిధిలో 3 వాహానాలు (2 టూ వీలర్స్ , 1 త్రీ వీలర్)

కోడుమూరు పియస్ పరిధిలో 6 వాహానాలు ( 6 టూ వీలర్స్)

కర్నూలు 2 టౌన్ పియస్ పరిధిలో 4 వాహానాలు (1 ఫోర్ వీలర్ , 3 టూ వీలర్స్ )

కర్నూలు త్రీ టౌన్ పియస్ పరిధిలో 4 వాహానాలు ( 2 త్రీ వీలర్స్, 2 టూ వీలర్స్)

కర్నూలు ఫోర్త్ టౌన్ పియస్ పరిధిలో 8 వాహానాలు ( 5 త్రీ వీలర్స్, 3 టూ వీలర్స్)

కర్నూలు తాలుకా పియస్ పరిధిలో 177 వాహానాలు ( 124 టూ వీలర్స్ , 53 త్రీ & ఫోర్ వీలర్)

ఓర్వకల్లు పియస్ పరిధిలో 2 వాహానాలు ( 2 టూ వీలర్స్ )

ఉల్లిందకొండ పియస్ పరిధిలో 11 వాహానాలు ( 11 టూ వీలర్స్ )

Related Posts

You cannot copy content of this page