116వ రోజు ప్రగతి యాత్రలో భాగంగా నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ..

Spread the love

: నియోజికవర్గ అభివృద్ధి బిఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యం….*
2 కోట్ల 50 లక్షల వ్యయంతో చింతల్ డివిజన్ పరిధిలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిర్మాణ పనులకు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే కే పి వివేకానంద్….

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 116వ రోజు ప్రగతి యాత్రలో భాగంగా ఎమ్మెల్యే కే పి వివేకానంద్ ముఖ్య అతిధిగా 128 చింతల్ డివిజన్ పరిధిలోని భగత్ సింగ్ నగర్ లో రూ. 59 లక్షలతో చేపట్టనున్న సి.సి. రోడ్డు నిర్మాణ పనులకు, ఎన్ బి ఎల్ నగర్లో రూ. 45లక్షలతో చేపట్టనున్న సి.సి. రోడ్డు నిర్మాణ పనులకు, ఖాజా పాన్ షాప్ – ముస్లిం గ్రావెయర్డ్ ఆర్ ఎం నగర్ లో రూ. 49 లక్షలతో చేపట్టనున్న సి.సి. రోడ్డు నిర్మాణ పనులకు, వల్లభాయ్ పటేల్ నగర్ లో భూగర్భ డ్రైనేజి నిర్మాణ పనులకు, వల్లభాయ్ పటేల్ నగర్ లో రూ. 49.5 లక్షలతో చేపట్టనున్న సి.సి. రోడ్డు నిర్మాణ పనులకు, ఈద్ గా -ఆర్ ఎమ్ రోడ్ రూ.47.5 లక్షలతో చేపట్టనున్న సి.సి. రోడ్డు నిర్మాణ పనులకు పాదయాత్ర చేస్తూ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కోట్ల నిధులతో పూర్తి చేసిన సీసీ రోడ్లు, భూగర్భడ్రైనేజీ అభివృద్ధి పనులను పరిశీలించారు. మిగిలి ఉన్న పనులు తెలుసుకొని అక్కడే ఉన్న అధికారులకు ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాటిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో గతంతో పోల్చితే తమ బస్తీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినందుకు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే కి ఘన స్వాగతం పలికి కృతజ్ఞతలు తెలిపారు
అనంతరం వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో బాగంగా కానీలలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ టి లక్ష్మ రెడ్డి, సీనియర్ నాయకులు మఖ్సూద్ అలీ, బసవరాజు, కె పి వెంకటేష్ గౌడ్, శేఖర్ రావు, అశోక్, వహీద్ ఖురేషి, వరదరాజు, సామ్రాట్, సాంబయ్య, భగత్సింగ్ నగర్ ప్రెసిడెంట్ శ్రీనాథ్, అమీర్ అలీ, షౌకత్, ఇర్ఫాన్, సిరాజ్, ఓరుగంటి అఖిల్ సాయి గౌడ్, గౌతమ్, సంపత్ గౌడ్, సుదర్శన్ రెడ్డి, కుమార్ రెడ్డి, మోహన్ రెడ్డి, ఇల్లయ్య యాదవ్, సంపత్ యాదవ్, రషీద్ భాయ్, ఖలీద్ పశ, గోపాల్, నర్సింగ్, శ్రీనివాస్ రెడ్డి, కామ్రేడ్ సత్యం, మహిళా నాయకులు విజయ్ లక్ష్మి, స్వప్న, మెహీరున్నీసా బేగం, జ్యోతి ప్రభ, వరలక్ష్మి, స్వర్ణలత, శ్యామలమ్మ, విద్య, సుమిత్ర, నీలిమ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page