114 వ రోజు ప్రగతి యాత్రలో భాగంగా నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Spread the love

బిఆర్ఎస్ పార్టీ తోనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యం….

2 కోట్ల 61 లక్షల వ్యయంతో కుత్బుల్లాపూర్ డివిజన్, జీడిమెట్ల డివిజన్ పరిధిలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిర్మాణ పనులకు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే కే పి వివేకానంద్….

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 114వ రోజు ప్రగతి యాత్రలో భాగంగా ఈ రోజు ఎమ్మెల్యే కే పి వివేకానంద్ ముఖ్య అతిధిగా 131 కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని పద్మా నగర్ ఫేస్ – 2 లో రూ. 30.5 లక్షలతో చేపట్టనున్న సి.సి. రోడ్డు నిర్మాణ పనులకు, శ్రీ రామ్ నగర్ కాలనీలో రూ. 10 లక్షలతో కమ్యూనిటీ హాలు భవన నిర్మాణ పనులకు, బాపు నగర్ కాలనీలో రూ. 10 లక్షలతో కమ్యూనిటీ హాలు భవన నిర్మాణ పనులకు, మాణిక్య నగర్ కాలనీలో రూ.10 లక్షలతో కమ్యూనిటీ హాలు భవన నిర్మాణ పనులకు, సూర్య నగర్ కాలనీలో రూ. 60 లక్షలతో చేపట్టనున్న భూగర్భ డ్రైనేజి నిర్మాణ పనులకు, రామ్ రెడ్డి నగర్ కాలనీలో రూ.19.40 లక్షలతో చేపట్టనున్న సి.సి. రోడ్డు నిర్మాణ పనులు మరియు 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలోని శ్రీ కృష్ణ నగర్ కాలనీలో రూ 40 లక్షలతో చేపట్టనున్న భూగర్భ డ్రైనేజి నిర్మాణ పనులు, బ్యాంకు కాలనీలో రూ. 33.70 లక్షలతో చేపట్టనున్న భూగర్భ డ్రైనేజి నిర్మాణ పనులు, హెచ్. ఏ.ఎల్. రాఘవేంద్ర కాలనీలో రూ. 15.30 లక్షలతో చేపట్టనున్న భూగర్భ డ్రైనేజి నిర్మాణ పనులు, ఏరోనాటికల్ ఎనక్లేవ్ కాలనీలో రూ. 15.00 లక్షలతో చేపట్టనున్న భూగర్భ డ్రైనేజి నిర్మాణ పనులు, గాంధీ విగ్రహం వద్ద రూ. 18.30 లక్షలతో చేపట్టనున్న భూగర్భ డ్రైనేజి నిర్మాణ పనులకు పాదయాత్ర చేస్తూ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసారు.


ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో కుత్బుల్లాపూర్ జీడిమెట్ల డివిజన్ల పరిధిలోని పలు కానీలలో 2 కోట్ల 61 లక్షల వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించుకోవడం జరిగింది అని ప్రజా సమస్యలను శాశ్వతంగా అధిగమించడమే లక్ష్యంగా బిఆర్ ఎస్ ప్రభుత్వం పనిచేస్తుంది అని అన్నారు గత ప్రభుత్వాల హయాంలో పట్టించుకోని అనేక బస్తీలు, కాలనీల అభివృద్ధిపై బిఆర్ ఎస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి వహించి వేల కోట్ల రూపాయల నిధులను వెచ్చిస్తూ ప్రజలకు ఇచ్చిన ఒక్కో హామీని పూర్తి చేస్తున్నామని తెలిపారు.
అనంతరం వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో బాగంగా కానీలలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కే ఎం గౌరీష్ మాజీ కార్పొరేటర్ బొడ్డు వెంకటేశ్వర్ రావు, బిఆర్ఎస్ పార్టీ నియోజిక యూత్ అద్యేక్షులు సోమేశ్ యాదవ్, డివిజన్ అద్యేక్షులు దేవరకొండ శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ సత్తి రెడ్డి, మాజీ కౌన్సెల్ర్ సూర్య ప్రభ, కుంట సిద్ది రాములు, సంపత్ మాధవ్ రెడ్డి, జ్ఞానేశ్వర్, గుమ్మడి మధుసూదన్, సుధాకర్ గౌడ్, కిషోర్ చారీ, నరేందర్ రెడ్డి, నగేష్, బీరప్ప, నగేష్ రెడ్డి, సమ్మయ్య నేత, కుంతీ మల్లేష్, విజయ్ హరీష్, స్వామి గౌడ్, నార్లకంటి బాలయ్య, కే గణేష్, జయం చారీ, సురేందర్ రెడ్డి, అజయ్ కుమార్,కాలనీ వాసులు బి మహేష్, ఎం రాజేష్, ఖలీల్ పాశా, సురేష్, భాస్కర్ రెడ్డి, సతీష్ రెడ్డి, సంపత్ గౌడ్, వీరం శెట్టి, బి. హనుమంత్, కే కనకయ్య, ప్రవీణ్ కుమార్, ముకుంద రావు, అమర్నాథ్ , మహిళా నాయకులు పద్మ, అరుణ రెడ్డి కవిత, లక్ష్మి, సక్కు, భారతమ్మ కాలనీ సంక్షేమ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page