డిసెంబ‌ర్ 9న భారీ లెవల్లో విడుద‌ల‌వుతున్న అరుణ్ విజ‌య్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ ‘ఆక్రోశం’

Spread the love

Arun Vijay’s action crime thriller ‘Akrosham’ is releasing on December 9 on a grand scale.

డిసెంబ‌ర్ 9న భారీ లెవల్లో విడుద‌ల‌వుతున్న అరుణ్ విజ‌య్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ ‘ఆక్రోశం’

వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో మెప్పిస్తూ త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సంపాదించుకున్న అరుణ్ విజ‌య్ హీరోగా సీహెచ్‌. స‌తీష్ కుమార్ అసోసియేష‌న్‌తో శ్రీమ‌తి జ‌గ‌న్మోహిని స‌మ‌ర్ప‌ణ‌లో విఘ్నేశ్వర ఎంటర్‌ టైన్మెంట్‌,మూవీ స్లయిడర్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యాన‌ర్స్‌పై జి.య‌న్‌.కుమార వేల‌న్ డైరెక్ష‌న్‌లో ఆర్‌.విజ‌య్ కుమార్ నిర్మాత‌గా రూపొందిన చిత్రం ‘ఆక్రోశం’. యాక్షన్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ అండ్‌ ఎమోషనల్‌ రివేంజ్ డ్రామాగా తెరకెక్కిన తమిళ చిత్రం ‘సినం’ను తెలుగులో ‘ఆక్రోశం’ పేరుతో డిసెంబర్ 9న  భారీ లెవ‌ల్లో విడుద‌ల చేయ‌టానికి నిర్మాత ఆర్‌.విజ‌య్ కుమార్ స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సంద‌ర్బంగా..

నిర్మాతలు సి.హెచ్.సతీష్ కుమార్, ఆర్.విజయ్ కుమార్ మాట్లాడుతూ ‘‘మంచి సినిమాలు, డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలను తెలుగు ప్రేక్ష‌కులు ఎప్పుడూ ఆద‌రిస్తారు. అరుణ్ విజ‌య్‌గారు తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితులే. ఆయ‌న హీరోగా న‌టించిన సినిమాలు కూడా ఇక్క‌డ మంచి ఆద‌ర‌ణ‌ను పొందాయి. ఇంత ముందు అరుణ్ విజయ్ హీరోగా న‌టించిన ఏనుగు సినిమాను మా బ్యాన‌ర్‌లో విడుద‌ల చేశాం. 

రీసెంట్‌గా త‌మిళంలో అరుణ్ విజ‌య్ మీరోగా న‌టించిన సినం సినిమా త‌మిళంలో సూప‌ర్బ్ రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకుంది. దాన్ని తెలుగులో ఆక్రోశం పేరుతో డిసెంబ‌ర్ 9న రిలీజ్ చేస్తున్నాం. యాక్ష‌న్‌, థ్రిల్ల‌ర్‌, రివేంజ్ ఇలా అన్ని క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ క‌ల‌గ‌లిసిన చిత్ర‌మిది. త‌ప్ప‌కుండా తెలుగు ఆడియెన్స్ సినిమా ఎంజాయ్ చేస్తారు’’  అన్నారు. 

పల్లక్ లల్వాని హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో  కాళీ వెంకట్‌, ఆర్‌.ఎన్‌.ఆర్‌.  మనోహర్‌, కె.ఎస్‌.జి. వెంకటేష్‌, మరుమలార్చి భారతి తది తరులు ఇతర పాత్రల్లో నటించారు.  ఈ సినిమాకు షబీర్‌ తబరే ఆలం సంగీతం అందించారు. గోపీనాథ్ సినిమాటోగ్రఫీ అందించారు. 

నటీనటులు:

అరుణ్ విజయ్, పల్లక్ లల్వాని, కాళీ వెంకట్, ఆర్. యన్. ఆర్ మనోహర్, కే. యస్. జి.వెంకటేష్, మరుమలార్చి భారతి తదితరులు 

సాంకేతిక వర్గం:

బ్యాన‌ర్స్‌ – విఘ్నేశ్వర ఎంటర్ టైన్మెంట్, మూవీ స్లయిడర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రొడ్యూసర్ – సీహెచ్‌ సతీష్‌ కుమార్‌, ఆర్.విజయ కుమార్ , దర్శకుడు – జి. యన్ ఆర్ . కుమారవేలన్, సంగీతం – షబీర్ తబరే ఆలం, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ – గోపీనాథ్, ఆర్ట్ డైరెక్టర్ – మైఖేల్ బి. యఫ్.ఏ , ఎడిటర్ – ఎ.రాజమహమ్మద్, అసోసియేట్ సినిమాటోగ్రఫీ – సోడా సురేష్ , అసోసియేట్ డైరెక్టర్ – కార్తీక్ శివన్ , కో డైరెక్టర్ – శరవణన్ రతినం , స్టోరీ – డైలాగ్ – ఆర్ శరవణన్ , కాస్ట్యూమ్ డిజైనర్ – ఆరతి అరుణ్ , లిరిక్స్ – కార్కి, ఏకనాథ్, ప్రియన్, తమిజానంగు, డి. ఐ  & వి. యఫ్. యక్స్: నాక్ స్టూడియోస్ , డి. ఐ కలరిస్ట్: రాజేష్ జానకిరామన్, స్టిల్స్: జయకుమార్ వైరవన్ , స్టంట్ – స్టంట్ సిల్వా , ప్రొడక్షన్ అడ్వైజర్: ఆర్ రాజా , పి. ఆర్. ఓ – బియాండ్ మీడియా (సురేంద్ర కుమార్ నాయుడు-  ఫణి కందుకూరి , మ్యూజిక్ లేబుల్ – ముజిక్ 247 , పోస్టర్స్ డిజైన్: విక్రమ్ డిజైన్స్

Related Posts

You cannot copy content of this page