SAKSHITHA NEWS

Any untoward incident during the New Year celebrations

నూతన సంవత్సరం వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటుచేసుకున్న వేడుకలు నిర్వహించుకోవాలి
-డిఎస్పి కొత్తగూడెం

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్.జి ఐపిఎస్ ఆదేశాల మేరకు నూతన సంవత్సర వేడుకలకు పటిష్టమైన పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగిందని కొత్తగూడెం డిఎస్పి జి.వెంకటేశ్వర బాబు శుక్రవారం రోజున ఒక ప్రకటనలో తెలియజేసారు.

ఏలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా *కొత్తగూడెం సబ్ డివిజన్ పరిధిలోని (10) పోలీస్ స్టేషన్ల పరిధిలో పికెట్లు (22) ఏర్పాటు చేశామని,(35) పోలీస్ పెట్రోలింగ్ పార్టీలతో నిరంతరం నిఘా,కట్టుదిట్టమైన బందోబస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

వన్స్ షాపులు రాత్రి 12.00 గంటలకు పూర్తిగా మూసివేయాలి.

బర్ అండ్ రెస్టారెంట్లు రాత్రి 1:00 గంటకు ఖచ్చితంగా ముసివేయాలి

నబంధనలు అతిక్రమించే వారిపైన చట్ట ప్రకారం చర్యలు

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిరంతరం పోలీస్ గస్తి ఉంటుంది.

మద్యం సేవించి వాహనాలు నడపరాదు*

రడ్లపై విచ్చలవిడిగా గుంపులు గుంపులుగా తిరగరాదు*

బకు రేసింగ్ లకు పాల్పడినా,సైలెన్సర్ లేని బైకులతో వింత వింత శబ్దాలు చేయరాదు*.

సంటర్లలో కేకు కటింగ్ లు నిషేధం*

నబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకొనబడతాయి.

నట్ పెట్రోలింగ్ ముమ్మరం చేయడమే కాకుండా విస్తృతంగా తనిఖీలు ఉంటాయి.

అంక్షలు అమల్లో వున్నందున ర్యాలీలు,బహిరంగ సభలకు అనుమతి లేదు.

అంతేకాకుండా సబ్ డివిజన్లో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ ల పరిధిలో గల సీసీ కెమెరాలను నిత్యం గమనిస్తూ నిబంధనలు అతిక్రమించిన వారిపై నా చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి

ఎక్కడైనా న్యూసెన్స్ జరిగితే 📞డయల్ 100 కాల్ చేయాలని తెలియజేశారు.

పలీసు వారి నియమ నిబంధనలను పాటిస్తూ ప్రజలందరూ పోలీసు వారికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ నూతన సంవత్సరాన్ని ప్రతి ఒక్కరూ ప్రశాంత వాతావరణంలో కుటుంబ సభ్యులతో కలిపి ఆనందంగా గడపాలని కోరుకుంటూ అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.


SAKSHITHA NEWS