ఏప్రిల్ 4 నుండి 8 వ తేదీ వరకు అన్నమయ్య వర్థంతి ఉత్సవాలు

Spread the love

ఏప్రిల్ 4న అలిపిరిలో మెట్లోత్సవం

పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమయ్య 521వ వర్ధంతిని పురస్కరించుకుని తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్ద ఏప్రిల్ 4వ తేదీ టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో మెట్లోత్సవం వైభవంగా జరుగనుంది.

అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు, భజన మండళ్ల కళాకారులు ఉదయం 6 గంటల నుంచి అన్నమాచార్యుల వారి ”సప్తగిరి సంకీర్తనా గోష్ఠిగానం” నిర్వహిస్తారు. అనంతరం శాస్త్రోక్తంగా మెట్లపూజ జరుగనుంది. ఆ తరువాత కళాకారులు సంకీర్తనలు గానం చేస్తూ కాలినడకన తిరుమలగిరులను అధిరోహిస్తారు. టీటీడీ ఉన్నతాధికారులు, రాష్ట్రం నలుమూలల నుంచి విచ్చేసిన‌ భజన మండళ్ల కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

అన్నమాచార్య వర్ధంతి ఉత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 5వ తేదీన తిరుమలలోని నారాయణగిరి ఉద్యాన వనంలో గోష్టిగానం, సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఏప్రిల్ 6 నుండి 8వ తేదీ వరకు మూడు రోజుల పాటు తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సాహితీ సదస్సులు, తాళ్లపాకలోని ధ్యానమందిరం, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

Related Posts

You cannot copy content of this page