కార్బోరహిత మామిడి పండ్ల మేళను సందర్శించిన ఉద్యానవన , పట్టు పరిశ్రమ అధికారి అనసూయ.

Spread the love

కార్బోరహిత మామిడి పండ్ల మేళను సందర్శించిన ఉద్యానవన , పట్టు పరిశ్రమ అధికారి అనసూయ.

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

ఖమ్మం నగరం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ప్రాంతంలో నుండి కార్బోరహిత మామిడి పండ్ల అమ్మకాలను నిర్వహించారు . ఈ కార్బోరహిత మామిడి పండ్ల మేళను ఉద్యానవన , పట్టు పరిశ్రమ అధికారి అనసూయ సందర్శించి పరిశీలించారు . ఈ సందర్భంగా ఉత్తమ రైతు బాణోత్ లక్ష్మణ్ నాయక్ మాట్లాడుతూ గత 11 సంవత్సరాల నుండి నగర ప్రజలకు ఎటువంటి రసాయన పదార్థాలు వాడకుండా కార్బోరహిత మామిడి పండ్లను అందిస్తున్నామని తెలిపారు . ఈసారి మార్కెట్లోకి చిన్న రసాలు , పెద్ద రసాలు మరియు బంగినపల్లి మామిడి పండ్ల వచ్చాయని సుమారుగా 80 రూపాయల నుండి 100 రూపాయలు వరకు ధరలు ఉన్నాయని పేర్కొన్నారు . ఉగాది సందర్భంగా ఉగాది పచ్చడ కొరకు పుల్లటి మామిడి కాయ ఒకటి ఉచితంగా ఇస్తారని పేర్కొన్నారు . గాంధీ చౌక్ మద్ది బాబు కాంప్లెక్స్ పక్కన కూడా ఈ అమ్మకాలు ఉన్నాయని అన్నారు . వివరాలకు ఈ క్రింది నెంబర్ 9908848371 , 9676828365 సంప్రదించగలరు .

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page