అమిత్ షా టార్గెట్ తెలంగాణే

Spread the love

హైదరాబాద్
తెలంగాణలో బిజెపి వేగం పెంచింది కేంద్రమంత్రి అమిత్ షా ఏప్రిల్ 23న హైదరాబాదుకు రానున్నారు. ఈ క్రమంలో చేవెళ్ల పార్లమెంటు పరిధిలో భారీ బహిరంగ సభకు రాష్ట్ర నాయకత్వం భారీ ఏర్పాటు చేస్తుంది, ఈ సభలో అమిత్ షా కీలకమైన ప్రకటనలు చేస్తారని తెలుస్తోంది అంతేకాకుండా భారీ స్థాయిలో చేరికలు ఉంటాయని పార్టీ వర్గాల్లో ప్రచారం నడుస్తుంది. బి ఆర్ఎస్ నుంచి ఇటీవల సస్పెండ్ అయిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాజీమంత్రి జూపల్లి కృష్ణారెడ్డి బిజెపిలో చేరనున్నారు అనే ప్రచారం జరుగుతుంది కర్ణాటక ఎన్నికల తర్వాత అమీత్ షా బిజెపి పై పూర్తిగా ఫోకస్ పెడతారని బిజెపి నేతలు చెబుతున్నారు కొద్దిరోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే తెలంగాణలో పరిస్థితి బీజేపీకి అనుకూలంగా ఉందని కేంద్ర హోం మంత్రి శాఖ అమిత్ షా అభిప్రాయపడ్డారు.

2024 లో జరగనున్న పార్లమెంటు ఎన్నికల కోసం ఆయన ఇప్పుడే ప్రచారాన్ని దక్షిణ గోవాలో ప్రారంభించారు. జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ తెలంగాణ ప్రజల మనోభావాలను ప్రస్తావించడం ప్రాధాన్యతను సంచరించుకుంది, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రజల దృష్టి బిజెపి వైపు ఉండడాన్ని నేను గమనిస్తున్నానని ఆయన అన్నారు. ఒడిశా లోను పరిస్థితి ఇదే విధంగా ఉందనిచెప్పారు. వచ్చే నెలలో కర్ణాటకలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. బిజెపి గోవా, ఉత్తరాఖండ్ వంటి చిన్న రాష్ట్రాల్లో మాత్రమే విజయం సాధిస్తుందంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు అలాంటి వాక్యాలు చేసి చిన్న చిన్న రాష్ట్రాలను అవమానపరచవద్దని అని ఆయన అన్నారు

Related Posts

You cannot copy content of this page