రైతు ఉద్యమాల వేగుచుక్క ఏఐకేఎస్

Spread the love

తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి

……

సాక్షిత సూర్యాపేట :- దేశవ్యాప్తంగా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్య పరిష్కారం కోసం వేగుచుక్కల పోరాటం చేసేది ఏ ఐ కె ఎస్ మాత్రమేనని తెలంగాణరైతు సంఘం జిల్లా అధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి అన్నారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ లో అఖిలభారత కిసాన్ సభ (ఏ ఐ కె ఎస్ ) ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా ఏఐకేఎస్ జెండాను ఆయన ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1936 ఏప్రిల్ 11 న వలస పాలన కు , భూస్వామ్య పీడనకు, కంపెనీ వ్యవసాయ కు వడ్డీ వ్యాపారుల దోపిడీ కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెల్లుబికిన రైతుల పోరాటం సంఘటిత పర్చే క్రమం లో ఉత్తర ప్రదేశ్ లక్నో వేదికగా అఖిల భారత కిసాన్ సభ ఆవిర్భావం జరిగింది అని అన్నారు, సాగు దారులకు భూములు పై హక్కు డిమాండ్ ను జాతీయ డిమాండ్ గా మార్చింది అని అన్నారు ప్రపంచ ఖ్యాతిని పోందిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, బెంగాల్ తెబాగ రైతాంగ పోరాటం, కేరళ ఉన్నప్ప వాయిలార్ రైతాంగ పోరాటం, మహారాష్ట్ర వర్లి ఆదివాసీ గిరిజన రైతాంగ పోరాటాల్లో అఖిల భారత కిసాన్ సభ భాగస్వామి అన్నారు, ప్రస్తుత దేశం లో కార్పొరేట్ వ్యవసాయం కు వ్యతిరేకంగా జరుపుతున్న పోరాటం లో అఖిల భారత కిసాన్ సభ ముఖ్య భాగస్వామి అని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దండ వెంకటరెడ్డి, రైతు సంఘం నాయకులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు, కొప్పుల రజిత, దండ శ్రీనివాస్ రెడ్డి, ప్రజా సంఘాల బాధ్యులు కో లిశెట్టి యాదగిరిరావు, కోట గోపి, వేల్పుల వెంకన్న, జె నరసింహారావు, ఎం, రాంబాబు,నెమ్మాది మనోజ్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page