యాడ్ లైఫ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ

Spread the love

Ad Life Projects Pvt Ltd is a company

యాడ్ లైఫ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వారు GHMC వారి సహకారంతో 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని PJR నగర్ లో గల కమ్యూనిటీ హాల్లో మహిళ గృహ ఉపాధి పేరిట మహిళలకు 26 కొత్త కుట్టు మిషన్లను స్పాన్సర్ చేయడం జరిగింది. ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి శాసనసభ్యులు ఆరెకపూడి గాంధీ కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్ మరియు నార్నే శ్రీనివాస్ తో కలిసి రిబ్బన్ కట్ చేసి శిక్షణా శిబిరాన్ని ప్రారంభించారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ కుట్టుపని వచ్చిన వారికి ఉపాధిగా మరియు క్రొత్తవారికి శిక్షణగా రెందువిధాలుగా శిబిరాన్ని నడపాలని సూచించారు. కుట్టు మిషన్లను అందించిన ఆడ్ లైఫ్ సంస్థ వారిని అభినందించారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, ఉపాధ్యక్షులు కాశినాథ్ యాదవ్,

ప్రధానకార్యదర్శి గుడ్ల శ్రీనివాస్, యాడ్ లైఫ్ డైరెక్టర్ డాలీ, డా౹౹ సుజాత, GHMC ప్రాజెక్ట్ ఆఫీసర్ ఇంద్రసేన, సి.ఓ ముస్తఫా, బీఆర్ఎస్ పార్టీ నాయకులు షౌకత్ అలీ మున్నా, యాదగిరి, అగ్రవాసు, కూర్మయ్య, దేవేందర్, దుర్గేష్, మహేష్, భిక్షపతి, ఖలీమ్, రాజ్యలక్ష్మి, మధులత, వెంకటలక్ష్మి, పుట్టం దేవి, మంజుల, షేక్ బీబీ, సురేఖ, రేణుక, స్వప్న, పద్మ, యాడ్ లైఫ్ సెక్రటరీస్ స్వప్న, గణిత, సమైక్య ప్రెసిడెంట్లు, ఆర్.పి లు మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page