పోడు భూముల పట్టాల జారీకి చర్యలు చేపట్టాలి

Spread the love

Actions should be taken to issue waste land titles

పోడు భూముల పట్టాల జారీకి చర్యలు చేపట్టాలి

-పోడు భూముల ప్రత్యేక అధికారి డా. యోగితా రాణా
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

పోడు భూముల పట్టాల జారీకి చర్యలు చేపట్టాలని సాంఘీక సంక్షేమ శాఖ కమీషనర్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పోడు భూముల ప్రత్యేక అధికారి డా. యోగితా రాణా అన్నారు. బుధవారం ఐడిఓసి కాన్ఫరెన్స్ హాల్లో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లు, రెవిన్యూ అధికారులు, అటవీ అధికారులతో అటవీ హక్కు పత్రాల జారిపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ, చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఏజెన్సీ ప్రాంతాల్లో పోడు భూముల సమస్యలకు పరిష్కారం లభించనుందని అన్నారు. పోడు భూముల్లో సాగు చేస్తున్న వారి నుండి దరఖాస్తులు స్వీకరించి, క్షేత్ర స్థాయిలో పరిశీలనలు చేసి, గ్రామ సభలు చేపట్టి, అర్హులైన వారికి పట్టాల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఖమ్మం జిల్లాలో పోడు భూములకు సంబంధించి షెడ్యూల్ తెగలకు వారి నుండి 9,507 దరఖాస్తులు 25,515 ఎకరాల్లో హక్కు పత్రాల కొరకు వచ్చాయన్నారు. క్షేత్ర స్థాయిలో సర్వే, విచారణ అనంతరం గ్రామ సభలు నిర్వహించి, తీర్మాణం చేపట్టి, అట్టి తీర్మానాలు డివిజన్ స్థాయిలో ఎస్డిఎల్సి పంపుట, అక్కడ ఆమోదం తదుపరి, జిల్లా స్థాయిలో జిల్లా స్థాయి అటవీ హక్కుల కమిటీకి సిఫారసు చేయుట జరిగిందని ఆమె అన్నారు.

షెడ్యూల్ తెగలకు సంబంధించి 6,989 దరఖాస్తుదారులు 11,462.32 ఎకరాలపై, అదనపు ప్యాచుల కొరకు 2,598 దరఖాస్తులు 2,535.35 ఎకరాలకు, మొత్తంగా 13,997.67 ఎకరాల్లో స్వాధీనంలో ఉన్నారన్నారు. గ్రామ సభలో 6,795 దరఖాస్తులు, 2,556 అదనపు ప్యాచ్ లు మొత్తంగా 13,656.95 ఎకరాలకు సిఫారసులు చేసినట్లు ఆమె తెలిపారు. పూర్తయ్యాయన్నారు.

జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఇప్పటివరకు 3,315 దరఖాస్తులు 4,359.38 ఎకరాలకు గాను ఆమోదించినట్లు తెలిపారు. జిల్లా స్థాయి సమావేశంలో అన్ని దరఖాస్తులపై పరిశీలన త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అభ్యంతరాలుంటే పరిశీలించి, ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని ఆమె తెలిపారు. సమీక్ష లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి వచ్చిన దరఖాస్తులు, పరిశీలనలు, గ్రామసభ లో సిఫారసుపై సమీక్షించారు.

సమావేశంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లు వి.పి. గౌతమ్, అనుదీప్, భద్రాచలం ఐటీడీఏ పీవో గౌతమ్ పోట్రూ, ఖమ్మం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహాలత మొగిలి, ఖమ్మం అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్, జిల్లాల రెవిన్యూ, అటవీ అధికారులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page