ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు మరువలేనివి

Spread the love

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు మరువలేనివి
రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు


స్వాతంత్ర సమర యోధుడు తెలంగాణ తొలి దశ ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి & ఆర్.డబ్ల్యూ.ఎస్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు అన్నారు.ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 11వ వర్ధంతి సందర్భంగా జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ప్రతిష్టాపన కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ రోహిత్ సింగ్ తో కలిసి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి & ఆర్.డబ్ల్యూ.ఎస్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు మరువలేనివని, తెలంగాణకు ఎనలేని సేవలను అందించారని, తొలి దశ మలిదశ ఉద్యమంలో తెలంగాణ కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ పాటుపడ్డారని అన్నారు. వారి పుట్టుక పద్మశాలీలలో అయినా కూడా వారి జీవితమంతా తెలంగాణ కోసం శ్రమించారని, కొండా లక్ష్మన్ బాపూజీ తెలంగాణ ప్రజలు గొప్పగా ఆరాధించే వ్యక్తి అని అన్నారు.నాడు తెలంగాణ కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలి, జలవిహార్ లో ఉన్న తన ఇల్లును ఉద్యమం కోసం ఉపయోగించిన మహనీయుడు బాపూజీ అని అన్నారు.

స్వాతంత్ర పోరాటం, నిజాం నిరంకుశ వ్యతిరేక ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ కోసం జరిగిన మూడు దశల ఉద్యమాలకు ఊపిరిలూదిన మహనీయుడు బాపూజీ అని, యావత్తు తెలంగాణ సమాజం కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలను గుర్తు ఉంచుకుంటుందని అలాంటి గొప్ప వ్యక్తి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వర్తించడం గర్వకారణం అని అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో ఏర్పాటు చేసేందుకు తన పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు.

ఈ కార్యక్రమంలో విగ్రహ ప్రతిష్టాపన కమిటీ అధ్యక్షులు డాక్టర్ మేడారపు సుధాకర్ , ప్రధాన కార్యదర్శి చిలకమారి సోమేశ్వర్, పాలకుర్తి, కొడకండ్ల గ్రామాల సర్పంచులు వీరమనేని యాకాంతరావు, పసునూరి మధుసూదన్, మండల పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి పెనుగొండ రమేష్, జనగామ జిల్లా పోపా సంఘం కార్యనిర్వహణ కార్యదర్శి చిదురాల ఎల్లయ్య, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు చిలకమారి వెంకటేశ్వర్లు, చిదురాల మార్కండేయ,
పద్మశాలి సంఘం నాయకులు కాటబత్తిని రమేష్, పెనుగొండ వెంకటేశ్వర్లు, చక్రాల రఘు, రాపోలు రాంబాబు, చిదురాల సోమరత్నం, రాపోలు గట్టయ్య, వల్లాల గౌరయ్య, కాటబత్తిని సోమేశ్వర్,
చిలుకమారి శ్రీధర్, మాచర్ల సత్యనారాయణ, పెనుగొండ సోమేశ్వర్, ఆనంద్,కుమార్ , చిలుకమారి ఉపేందర్, ఎనగందుల శ్రీనివాస్, పొన్నాల వీరయ్య,చిలకమారి వాసు, రమేష్,తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page