ఏపీలో రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ

Spread the love

అభ్యర్థితో కలిపి 5గురుకి మాత్రమే అనుమతి

రాజకీయ ప్రకటనలకు అనుమతి తప్పనిసరి

ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఈనెల 18వ తేదీ గురువారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఈ నెల 18 న ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుందని, ఆరోజు నుంచీ నామినేషన్లను స్వీకరించడం జరుగుతుందన్నారు. నామినేషన్ల దాఖలకు చివరి తేదీ 25వ తేదీ, 26న నామినేషన్లను పరిశీలించడం జరుగుతుంది, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ 29వ తేదీ మరియు అభ్యర్థులకు అదే రోజు గుర్తులను కేటాయించటం జరుగుతుంది. మే 13వ తేదీ పోలింగ్ జరుగుతుంది, జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుంది.

నామినేషన్ల స్వీకరణలో తీసుకోవలసిన జాగ్రత్తలు, పాటించాల్సిన నిబంధనలు

1)అభ్యర్థులు నామినేషన్ల దాఖల కు 13 రకాల డాక్యుమెంట్లను తీసుకురావాలని, అన్ని రకాల డాక్యుమెంట్లు సక్రమంగా ఉంటే నామినేషన్లను అనుమతించడం జరుగుతుంది.

2)పార్లమెంటరీ నియోజకవర్గం కోసం ఫారం-2ఏ, అసెంబ్లీ నియోజకవర్గం కోసం ఫారం-2బి సమర్పించాలి.

3)నోటిఫైడ్ తేదీలలో ఉదయం 11.00 నుండి మధ్యాహ్నం 3.00 వరకు నామినేషన్లను స్వీకరించడం జరుగుతుంది

4) పబ్లిక్ సెలవు దినాలలో నామినేషన్ స్వీకరించ బడదు.

5) అభ్యర్థులు గరిష్టంగా 4 సెట్ల నామినేషన్ దాఖలు చేయవచ్చు.

6) 2 కంటే ఎక్కువ నియోజకవర్గాల నుండి అభ్యర్థులు నామినేషన్లను ఫైల్ చేయడం కుదరదు.

7) నామినేషన్ల దాఖలు సమయంలో 100 మీటర్ల పరిధిలో గరిష్టంగా 3 వాహనాలు అనుమతించ బడతాయి, అలానే 5 మంది వ్యక్తులు (అభ్యర్థితో సహా) ఆర్ఓ ఆఫీస్‌లోకి ప్రవేశించవచ్చు.

8) నామినేషన్ల స్వీకరణకు సంబంధించి ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేస్తారు.

9)అభ్యర్థి నామినేషన్ వేసిన దగ్గర నుంచీ, ఖర్చు అతని ఖాతాలో లెక్కించడం జరుగుతుంది.

10) పత్రికల్లో వచ్చే ప్రకటనలు, పెయిడ్ న్యూస్ వార్తలను అభ్యర్థి ఖాతాలో లెక్కించడం జరుగుతుంది.

11) ప్రతీ అసెంబ్లీ నియోజక వర్గానికి 40 లక్షల ఖర్చు పరిమితి, అలానే పార్లమెంట్ అభ్యర్థికి 95 లక్షల రూపాయల ఖర్చు పరిమితం..

Related Posts

You cannot copy content of this page