ములుగు -హన్మకొండ జాతీయ రహదారిపై ఉదృతంగా ప్రవహిస్తున్న వరద

Spread the love

వరంగల్ జిల్లా :
ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం కటక్షపూరి చెరువు మత్తడి పోస్తుంది,హన్మకొండ ములుగు జాతీయ రహదారిపై ఉధృతంగా వరద ప్రవహిస్తుంది, దీంతో వాగు దాటాలంటే వాహనదారులు భయపడుతున్నారు. మరోవైపు భారీ వర్షాల తో వరంగల్ జిల్లా వాసులను వణి కిస్తున్నాయి కుండపోత వానలు వరంగల్ జిల్లా హన్మకొండ లోని లోతట్టు ప్రాంతాలను ముంచేస్తున్నాయి వరంగల్ లోని పలు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి, మోకాలు లోతు పైగా వరద నీటిలో కాలనీ వాసులు ఇండ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది, మరోవైపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో జోరు వర్షం కురుస్తుంది. ఇప్పటికే వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ కుడా జారీ చేసింది. భారీ వర్షంతో కష్టాలు పడుతున్న నగరవాసులకు వాతావరణ శాఖ హెచ్చరికలతో భయంతో కాలనీవాసులు బిక్కుబిక్కుమంటున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజల కోసం పునరవాసం ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. వరద నీటితో ముంచెత్తిన కాలనీ లను బుధవారం ఉదయం వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. బాధితులతో స్వయంగా మాట్లాడిన సిపి రంగనాథ్ వారికి ధైర్యం చెప్పారు.

Related Posts

You cannot copy content of this page