SAKSHITHA NEWS

విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మి దేవి.

శ్రీకాకుళం నగర్ కార్పొరేషన్ పరిధిలో స్థానిక
జి.టి.రోడ్ లో గల కరెంట్ ఆఫీస్ దగ్గర విద్యుత్ చార్జీల భారీ పెంపును హద్దులేని కరెంట్ కోతలును నిరసిస్తూ స్థానిక ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న శ్రీకాకుళం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మి దేవి.
అమ్మమాట్లాడుతూ రాష్ట్రంలో విద్యుత్ విద్యుత్తు చార్జీలు బదుడే బాదుడు అని కమిషన్ల కోసం కృత్రిక కొరత సుష్టిస్తూ బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు వేలకోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారని సెకీ ఒప్పందం ద్వారా 20వేల కోట్లు భారం విద్యుత్ వినియోగదారులపై వేస్తున్నారని శ్రీకాకుళం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మి దేవి తెలియజేశారు.చంద్రబాబు నాయుడు ఐదేళ్లలో 36 లక్షల గృహ విద్యుత్ కనెక్షన్లు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు మూడేళ్లు ఇచ్చింది 8 లక్షలు మాత్రమే అని గత తెలుగుదేశం ప్రభుత్వంలో విద్యుత్ చార్జీలు ఎప్పుడూ పెంచలేదని, కరెంటు కోతలు లేవని తెలిపారు.ఈ కార్యక్రమంలో నగర్ తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS