దేవినేని ఉమాకు జాతీయ నేతల పట్ల ఉన్న గౌరవం ఇదేనా?
మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పాదరక్షలు ధరించి నివాళులర్పించిన దేవినేని.
దేవినేని ఉమాను చూస్తే గురివింద గింజ సామెత గుర్తు వస్తోంది.
-మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు గారు.
ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం, 24.4.2023.
మాజీ మంత్రి దేవినేని ఉమాకు జాతీయ నేతల పట్ల ఉన్న గౌరవం ఇదేనా? అంటూ మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు ప్రశ్నించారు.
ఇబ్రహీంపట్నం శక్తి నగర్లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటీవల మైలవరంలో మహాత్మ జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాదరక్షలు ధరించి నివాళులర్పించారని దానికి సంబంధించిన వీడియోను ప్రదర్శించారు. దీన్ని బట్టి దేవినేని ఉమాకు ఉన్న సంస్కారం, గౌరవం అంచనా వేయవచ్చన్నారు.
ఈ విషయం అప్పుడే తన దృష్టికి వచ్చినా, ప్రతిదీ రాజకీయం కోసం వాడుకునే నైజం తనది కాదన్నారు. గతంలో అతను మంత్రిగా వున్నప్పుడు మహాత్మా పూలే గారి విగ్రహం ఏర్పాటు చేయాలని, లేకుంటే కనీసం స్థలం అయినా కేటాయించాలని దీక్ష చేసిన నాయకులను అరెస్టులు చేయించిన సంస్కృతి దేవినేని ఉమాది అని అన్నారు.
ఇతను మంత్రిగా, ఎమ్మెల్యేగా వున్నప్పుడు మైలవరంలో వాళ్ళ పార్టీ నాయకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారి విగ్రహం చెయ్యి విరిగితే కూడా పట్టించుకోని కపట నాటక సూత్రధారి దేవినేని ఉమా అని విమర్శించారు.