SAKSHITHA NEWS


No bouquets, shawls..

బొకేలు,శాలువాలు వద్దు..

నోట్ బుక్స్,స్టేషనరీ ఇవ్వండి.

అంగన్ వాడి పిల్లలకు మ్యాట్ లు ఇవ్వండి..మీ గ్రామాల్లో,మీ వార్డుల్లో పాఠశాలలను దత్తత తీసుకోండి.

వృధా ఖర్చుల స్థానంలో ఒక మంచి పనికి ముందుకు రండి.

మీరు చేసే చిన్న సహాయం భవిష్యత్తు తరాలకు వెలుగులు నింపేదిగా మారుతుంది.

ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, ప్రజలకు మంత్రి పువ్వాడ విజ్ఞప్తి.

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

నూతన సంవత్సరం-2023 సందర్భంగా తనను కలువటానికి వచ్చే వారు ఎవరు కూడా బొకేలు, శాలువలు తీసుకురావొద్దని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విజ్ఞప్తి చేసారు. ఇతర నేతలను, అధికారులను కలువటానికి వెళ్ళేటప్పుడు కూడా ఇదే విధంగా ముందుకు వెళ్లాలని కోరారు.

అలాంటి వృధా ఖర్చుల స్థానంలో విద్యార్థులకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. వాటి స్థానంలో విద్యార్థులకు ఉపయోగపడే నోట్ పుస్తకాలు, బ్యాగులు, వాటర్ బాటిల్స్, పెన్నులు, పెన్సిళ్లు, అంగన్ వాడి పిల్లలకు మ్యాట్లు, చిన్న వాటర్ బాటిళ్లు, ఇతరత్రా వాటిని అందించాలని కోరారు.

రానున్న నూతన సంవత్సరము 2023 సందర్భంగా అందరూ ఒక కొత్త నిర్ణయం తీసుకొని, అమలు చేయాలని కోరారు. నూతన సంవత్సరంతో పాటుగా జన్మదినాల సందర్భంగా ఇలాంటి సమాజ హిత కార్యక్రమం చేపట్టడం ద్వారా పేద,మధ్య తరగతి విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు.

వివిధ కార్యక్రమాల సందర్భంగా కూడా ఇదే విధానాన్ని పాటించాలని కోరారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు ఈ దిశగా రానున్న జనవరి ఒకటో తేదీ నుండి ఈ నిర్ణయాన్ని అమలు చేసి జిల్లాలో ఓ సరికొత్త విధానానికి నాంది పలుకలన్నారు..నాయకులు ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకొని ఆయా పాఠశాలల అభివృద్ధి లో భాగస్వాములు కావాలని కోరారు.


SAKSHITHA NEWS