SAKSHITHA NEWS

TU stood by the poor journalist

నిరుపేద జర్నలిస్టు కు అండగా నిలిచిన టీయూ డబ్ల్యూయుజె(టీజేఎఫ్)….

పేషెంట్ ను స్ట్రేచ్చర్ప్ పై ఐదు అంతస్థులకు చేర్చిన జర్నలిస్ట్ బృందం

రూ.10 వేలు ఆర్ధిక సహాయం

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

ఖమ్మంలోని వైరా రోడ్డు ఇందిరానగర్ సమీపంలోని సీఎస్ఐ చర్చ్ వద్ద విధుల నిమిత్తం రఘునాధపాలెం మండలం వార్త విలేకరి పాశం వెంకటేశ్వర్లు తన స్కూటీ పై వస్తుండగా గుర్తు తెలియని ద్విచక్రవాహం వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది.తీవ్ర గాయాల పాలైన పాశం వెంకటేశ్వర్లు ను హుటాహుటిన ఖమ్మంలోని శ్రీరక్ష హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు.

విషయం తెలుసుకున్న టీయూ డబ్ల్యూయుజె (టీజేఎఫ్,143) యూనియన్ జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ, నగర కమిటీ ల బాద్యులు హాస్పిటల్ కు వెళ్లి పరామర్శించి చికిత్సకు సంబంధించిన వివరాలను సంబంధిత వైద్యులను అడిగి తెలుసుకున్నారు. పాశం వెంకటేశ్వర్లు కు తొంటి భాగంలో సర్జరీ చేయాల్సి ఉందని డాక్టర్లు తెలిపారు.


యూనియన్ అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ,ప్రధాన కార్యదర్శి చిర్రా రవి,ఉపాధ్యక్షులు వెన్నబోయిన సాంబశివరావు లు మానవత్వ దృక్పథంతో ఆలోచించి చికిత్స నిమిత్తం తక్షణ ఆర్ధిక సహాయంగా రూ.10 వేలు ఇచ్చి ఔదార్యం చాటుకున్నారు.

ఖమ్మం లోని శ్రీరక్ష హాస్పిటల్ లో పాశం వెంకటేశ్వర్లు కు సర్జరీ ముగిసింది.డాక్టర్లు వెంకటేశ్వర్లు ను ఇంటికి తీసుకెళ్లొచ్చని సూచించారు.45 రోజులు బెడ్ పై పడుకునే ఉండాలని డాక్టర్లు తెలిపారు.పేషెంట్ ను
తీసుకెళ్లే సమయంలో పలు జాగ్రత్తలు కూడా రోగి బంధువులకు చెప్పారు.

పేషెంట్ ను వీల్ చైర్ లో కూర్చో పెట్టకుండా,స్ట్రేచ్చర్ లో పడుకో పెట్టుకునే ఇంటికి తీసుకెళ్లాలి.ఏమాత్రం విరుద్ధంగా వ్యవహరించిన సర్జరీ ఫేలయ్యే అవకాశం ఉందని చెప్పారు.దింతో పాశం వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు నిస్సహాయ స్థితిలో పడ్డారు.

భుజస్కంధాలపై మోసిన జర్నలిస్టులు.

పాశం వెంకటేశ్వర్లు నివాసం ఉండేది భైపాస్ రోడ్డు లోని చందమామ అపార్ట్ మెంట్ లోని 5 వ అంతస్థు లో.పాశం వెంకటేశ్వర్లు,అతని కుటుంబ సభ్యులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.

స్ట్రేచ్చర్ పైన 5 అంతస్థులు ఎలా తీసుకెళ్లాలని ఆందోళన చెందారు.లిఫ్ట్ లో తీసుకెల్దామంటే స్ట్రేచ్చర్ ఏమాత్రం సరిపోదు.అపార్ట్ మెంట్ మెట్లపై మోసుకెల్దామంటే నా అనే వాళ్ళు లేకుండా అయ్యిందేనని సందిగ్ధంలో పడి కుటుంబ సభ్యులకు కంటతడి ఒక్కటే మిగిలింది. అప్పుడు యూనియన్ జిల్లా అధ్యక్షులు,దృఢ సంకల్పం ఉన్న వ్యక్తి యూనియన్ సభ్యులు తన కుటుంబ సభ్యులుగా భావించే నైజం కలిగిన మానవతావాది ఆకుతోట ఆదినారాయణ ముందడుగు వేసి,పాశం వెంకటేశ్వర్లు ను 5 వ అంతస్థులోకి చేర్చే బాధ్యతను తన భుజస్కందల పై వేసుకుని కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు.

ఈ కార్యక్రమంలో టీయూ డబ్ల్యూయుజె (టీజేఎఫ్) నాయకులు ఉత్కంఠం శ్రీను,మీడియా సెల్ ఇంచార్జ్ పెరబోయిన తిరుపతిరావు, ఖమ్మం నగర టెంజూ అధ్యక్షులు యలమందల జగదీష్, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుద్దేటి రమేష్ బాబు,కోశాధికారి కొరకొప్పుల రాంబాబు,జిల్లా నాయకులు బిక్కి గోపి,రామకృష్ణ,నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS